అసలు టాలీవుడ్ లో నిజాలకన్నా.. పుకార్లకే ప్రథమ స్థానం ఉంటుంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడేం జరిగిందో నిజమెంతో తెలియకపోయినా కూడా వారి మధ్యన ఏదో ఉందని... వారిరువురు గొడవలు పడ్డారని... అబ్బో ఒకటేమిటి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకొచ్చేస్తాయి. అది మీడియా తప్పు కూడా కాదు. కొన్నిసార్లు ఆ ఊహ కథనాలే నిజమవుతుంటాయి. అలాంటప్పుడు మీడియాని పొగిడినవాళ్ళే... అదే గనక రూమర్ అని తెలిస్తే మీడియాని బండ బూతులు తిడతారు. ఇక ఈ మధ్యన అఖిల్ పెళ్లి రద్దయిందంటూ వచ్చిన వార్తలు ఇప్పటివరకు ఖండించకుండా నాగార్జున ఫ్యామిలి గమ్మునుండి పోయింది. అంటే మీడియాలో వచ్చిన అఖిల్ పెళ్లి రద్దు వార్త నమ్మాలా? లేదా? అనేది ఇప్పటివరకు అర్ధమే కానీ విషయం.
ఇక ఇదంతా ఇలా ఉండగా ఆమద్యన మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనతో విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని కొన్ని రోజులకే రుజువైంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యం గా ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాల్గొంటూ సరదాగా వుండే ఈ జంట మీద ఆ వార్తలన్నీ కేవలం పుకారు అని తేలిపోయాయి. ఇక వీరు ఇప్పుడు జంటగా రిషికేష్ లోని ప్రమథాశ్రమంలో కనబడ్డారు. ఉపాసన అక్కడికి అంతర్జాతీయ యోగా సదస్సు లో పాల్గొనడానికి వెళుతుండగా ఉపాసనకు తోడుగా చరణ్ కూడా రిషికేష్ వెళ్ళాడు. అక్కడ అంతర్జాతీయ యోగా సదస్సు లో ఉపాసన ప్రసంగించబోతోంది. ఉపాసనని ప్రోత్సహించడానికే రామ్ చరణ్ కూడా వెళ్ళాడట. ఈ విషయాన్ని ఉపాసనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక వీరిద్దరూ అక్కడ ఉద్యానవనములో దిగిన ఫోటో ని కూడా పోస్ట్ చేసి తమ మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలియజెప్పింది. ఇక ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు మాత్రం అబ్బో చరణ్ బాబు... భార్య ఉపాసనతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారుగా అని అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ఇప్పటికే తన భార్యతో కలిసి విదేశీ టూర్స్ వేస్తూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడని అందరికి తెలిసిందే.