ఈమె నోరు విప్పితే..కాపురాలు కూలుతాయంట!


మొన్న మలయాళ హీరోయిన్ భావన లైంగిక వేధింపులకు గురై వేధింపబడింది. నిన్న తమిళ తార వరలక్ష్మి తనపై కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.... సోషల్ మీడియాలో స్పందించింది. ఇక తాజాగా ఆ లిస్టులోకి టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత చేరింది. ఇక్కడ హీరోయిన్ గా వెలుగొందాలంటే చాలామందితో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవాలని... అలా తాను ఎవరికీ లొంగకపోవడం వల్లే తాను హీరోయిన్ గా ఇక్కడ నిలదొక్కుకోలేక పోయానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. టాలీవుడ్ లో 'నచ్చావులే' తో హీరోయిన్ గా పరిచయమైన మాధవిలత రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాకపోవడంతో...... సైలెంట్ గా తన పని చూసుకుంటూ... ఆ మధ్యన ఒక షార్ట్ ఫిలింలో నటించింది. కానీ ఆ షార్ట్ ఫిలిం కూడా ఆమెకు హెల్ప్ కాలేదు. ఇక తర్వాత మాధవి యాంకర్ గా అవతారమెత్తబోతుందని న్యూస్ కూడా వచ్చింది. మరి ఇలాంటి సమయంలో మాధవిలత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుండా మాధవి.. నేను నోరు విప్పితే కొన్ని కాపురాలు కూలిపోతాయని చెబుతోంది. మరి అంతగా ఆమెను వేధించిన వారెవరో? మరి ఇప్పుడు మాధవి వ్యాఖ్యలకు ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయో అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

అసలు ఇలాంటి విషయాలను రాధికా ఆప్టే ఎప్పటినుండో మొత్తుకుంటూనే వుంది. అసలు ఆమె మాటలను ఎవరన్నా విన్నారా?. రాధికా ఆప్టే టాలీవుడ్ లో ఇలా తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పి సంచలనానికి తెరలేపింది. అప్పట్లో ఆమె ఏదో చెబుతుందిలే.... ఇక్కడ బడా హీరోలతో నటించి అలా చెప్తుంది... ఏమిటి అని అందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. ఆ తర్వాత తాప్సి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. మరి నిజంగానే ఆఫర్స్ చేజిక్కించుకోవాలంటే అలా సెక్సువల్ రిలేషన్ కి ఒప్పుకోవాల్సిందేనా? టాలెంట్ కి ఇక్కడ అసలు చోటు లేదా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆలోచింపచేస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES