Advertisement
Google Ads BL

ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు బాబు ఎత్తులు!


ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం నానా విధాలుగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం ద్వారా ఆ రకంగా రాష్ట్రాభివృద్ధికి మార్గాన్ని సుగమం చేయవచ్చన్నది బాబు వ్యూహంలో భాగం కావచ్చు. ఆ రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి బాబు శతవిధాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందుకనే బాబు ఎక్కడికి వెళ్ళినా... విదేశాల‌కు వెళ్లినా కూడా ఏపీ ఇమేజ్ ను పెంచేందుకు అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ ను, ఆంధ్రాలో ప్ర‌పంచ‌స్థాయి నిర్మాణాలు వాటి ప్ర‌ణాళిక‌ల మీద విపరీతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న దావోస్ వెళ్లినప్పుడు కూడా బాబు ప్ర‌పంచం అంతా ఆంధ్రావైపు చూస్తోంద‌న్న విషయాన్ని అక్కడ గట్టిగా పలికాడు. అలా చంద్రబాబు ఆంధ్రాను అభివృద్ధిని చెందించే దిశగా రాష్ట్రంపై సానుకూల ప్ర‌చారం చేయ‌డం మంచిదే, కానీ కేవలం ప్రచారంతోనే ఏమీ సాధించలేమన్నది గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా సి.ఎన్.బి.సి టీవీ 18 ఏపీకి స్టేట్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ప్ర‌క‌టించింది. అయితే ఈ అవార్డును అందుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఆహ్వానం  అందింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు కూడాను. అయితే ఏపీలో టెక్నాల‌జీ వాడ‌కం అద్భుతంగా ఉంద‌నీ, సమర్థులైన నాయ‌క వర్గం రాష్ట్రంలో ఉంద‌నీ, వృద్ధి రేటు కూడా బాగుంద‌నే.. ఇలాంటి కొన్ని అంశాల‌ను తీసుకొని ఏపీకి ఈ అవార్డు ఇచ్చినట్లుగా ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది అంటూ ప్రచారం చేసుకున్నది ఏపీ ప్రభుత్వం. అలా భాగ‌స్వామ్య స‌ద‌స్సును చూపించి  మొత్తం రూ. 10.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు తెచ్చామ‌ని భుజాలు ఎగరేసి మరీ చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఎంతవరకు నైతికత ఉందో తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా చంద్ర‌బాబు ఆంధ్రా అభివృద్ధి పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి చూసినట్లయితే.. మేడిపండు చందంగా మారే అవకాశం లేకపోలేదని సామాన్యుడు ఆవేదనకు లోనవుతున్నాడు. ఇంకా అసలు ఏపీలో రాజ‌ధాని నిర్మాణమే మొద‌లు కాలేదు, ఎన్నిక‌ల ముందు బాబు ఇచ్చిన హామీలు  పూర్తి అవడం కాదు, ప్రారంభమే కాలేదు, అదేవిధంగా ఏపీలో రైతాంగం కష్టాల్లో ఉంది. అటు చూస్తే.. ప్రత్యేక హోదా అట‌కెక్కింది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ విషయంలో కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదు. ఇలాంటి ఈ సందర్భంలో ఏపీ అభివృద్ధి మహా గొప్పగా ఉందంటూ అవార్డులు ప్రకటించుకోవడం, అవి అందుకోవడం ఎంతవరకు సబబన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చూద్దాం ఇలాగైనా చంద్రబాబు కల నెరవేరుతుందేమో...!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs