Advertisement
Google Ads BL

ఈ భక్తుడిని ఆ దేవుడు కరుణించినట్లేనా..?


పవన్‌కళ్యాణ్‌ ఒక వ్యసనం వంటి వాడు.. ఒక్కసారి అతనితో కలిసి మాట్లాడితే మరలా కలవకుండా, మాట్లాడకుండా ఎవ్వరూ ఉండలేరు.. అని ఓ వేడుకలో కమెడియన్‌, బ్లాక్‌బస్టర్‌ నిర్మాత బండ్ల గణేష్‌ అన్నాడు. చిన్న చిన్న కామెడీ పాత్రలను చేసుకునే బండ్లగణేష్‌ని ఆంజనేయులు తర్వాత పవన్‌ 'తీన్‌మార్‌'తో పూర్తి స్థాయి నిర్మాతను చేశాడు. ఈ చిత్రం బాగా ఆడకపోయేసరికి మరలా తానే పిలిచి 'గబ్బర్‌సింగ్‌' చేశాడు. ఈ చిత్రం ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ను క్రియేట్‌ చేసింది. ఇక బండ్ల గణేష్‌కి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. వరుసగా స్టార్స్‌తో చిత్రాలు చేశాడు. కాగా గత కొంతకాలంగా ఆయన ఇండస్ట్రీ నుంచి మాయమయ్యాడు. ఈమధ్య యూట్యూబ్‌ చానెల్స్‌లో సందడి చేస్తు వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు సైతం ఇంటర్వ్యూ ఇచ్చాడు. కాగా ఇటీవలి కాలంలో పవన్‌కు బండ్లగణేష్‌తో వ్యవహారం చెడిందని, దాంతో పవన్‌ తన ముఖ్యుల జాబితా నుంచి బండ్లను తొలగించాడనే టాక్‌ మొదలైంది. ఇటీవలి ఇంటర్వ్యూలో కూడా తాను పవన్‌ని కలిసి రెండేళ్లకు పైగా కావస్తోందని, తనను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సారి పవన్‌ వద్దకు తీసుకెళ్లాడని చెప్పాడు బండ్ల. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ భక్తుడు తన దేవుడైన పవన్‌ని 'కాటమరాయుడు' సెట్లో కలసి ఓ ఫొటో దిగాడు, ఎంతో వినయంగా నిల్చొని ఉన్న గణేష్‌ భుజంపై పంచెకట్టులో ఉన్న పవన్‌ చేయి వేసి ఈ ఫొటో దిగాడు. దీంతో ఈ భక్తునికి మరలా తన దేవుని ఆశీస్సులు లభించాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోపక్క 'కాటమరాయుడు' చిత్రం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ చిత్రంలోని ఓ సీన్‌ లీకై సంచలనం సృష్టిస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌గా చెప్పబడుతున్న కొన్ని సీన్స్ లీక్‌ అయ్యాయి. ఇవి ఎడిటింగ్‌ టేబుల్‌ నుంచే లీకైనట్లు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే పవన్‌ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే సగం చిత్రం లీకైనా అదృష్టవశాత్తు విజయం సాధించింది. మరి ఇప్పటికైనా పవన్, యూనిట్‌ ఈ లీకేజీ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs