Advertisement
Google Ads BL

బాహుబలి జోరు మొదలైంది..!


'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' విడుదలకు ఇంకా రెండు నెలలు ఉండగానే ప్రమోషన్స్‌ వేగం పెంచనున్నారు. ఇటీవల సర్‌ప్రైజింగ్‌గా మహాశివరాత్రికి జక్కన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, ఈ సినిమాపై సుమకు ఇంటర్వ్యూ ఇచ్చి తన వేగం పెంచాడు. ఈ చిత్రం మొదటి పార్ట్‌ ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక పార్ట్‌2 విషయానికి వస్తే మార్చి 28న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఈ వేడుకను భారీ ఎత్తున చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs

ఇటీవలే చిత్ర యూనిట్‌ కూడా ఆర్‌ఎఫ్‌సికి వెళ్లి రెక్కీ నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆడియోకు కూడా నెల సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఈ ఏర్పాట్లను వేగవంతం చేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌లో పాటు పలు భాషల సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నారు. మార్చి మధ్యలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కీరవాణి రీరికార్డింగ్‌లో తలమునకలై ఉన్నాడు. అలాగే జక్కన్న కూడా గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌ వంటి పనులను పర్యవేక్షిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. మొత్తానికి 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌ 28నే విడుదల చేయాలని జక్కన్న నిర్ణయించేశాడు. సో.. ఇక 'బాహుబలి' సందడి హోరు మార్చి నుంచే మొదలుకానుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs