'సైజ్‌జీరో' తర్వాత స్వీటీ అనుష్క బాగా లావైంది. ఆ తర్వాత ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పూర్వపు కొలతలకు దూరమైంది. ఈ విషయం ఆమధ్య లీక్ అయిన 'బాహుబలి2' వీడియో స్పష్టంగా కనిపించింది. ఇక వేర్వేరు ఫంక్షన్లు, 'ఓం నమో వేంకటేశాయ, ఎస్3' చిత్రాలలో కూడా అనుష్క బాగా బొద్దుగా కనిపించింది. కానీ ఇటీవల విడుదలైన 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లో ప్రభాస్‌తో విల్లంబులు చేతబట్టిన అనుష్క పోస్టర్‌లో మాత్రం నాజూకుగా కనిపించింది. దీంతో ఇదంతా గ్రాఫిక్స్ మాయాజాలమనే విమర్శలు మొదలయ్యాయి. ఇక ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లో దేవసేనగా అనుష్క పాత్ర కీలకం. కానీ అదృష్టవశాత్తు ఈ చిత్రంలోని ఆమె భాగాన్ని ఎక్కువ శాతం 'సైజ్‌జీరో'కి ముందే షూటింగ్ పూర్తి చేశారట. ఇక ఆ తర్వాత తీసిన కొన్ని సన్నివేశాలలో మాత్రం అనుష్క బొద్దుగా కనిపిస్తూ ఉండటంతో రాజమౌళి ఆ విషయంపై దృష్టిపెట్టాడట. గ్రాఫిక్స్ సాయంతో ఆమెను నాజూకుగా చూపించే పనిలో తలమునకలై ఉన్నాడు.
ఈ చిత్రంలో అనుష్క పాత్ర కీలకం కావడంతో ఖర్చు కాస్త ఎక్కువైనా కూడా ఈ విషయంలో రాజమౌళి కాంప్రమైజ్ కావడం లేదట. మొత్తానికి అనుష్క 'సైజ్‌జీరో' సాహసం వల్ల దర్శకనిర్మాతకు ఇబ్బందులు ఎదురైన మాట మాత్రం వాస్తవం. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్' విషయానికి వస్తే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేది అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. కాగా ఈ చిత్రం కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది. మరో విశేషం.. ఏమిటంటే.. ఈ కథ వింటుంటే నిజంగానే 'బాహుబలి-ది కన్‌క్లూజన్' కథ ఇదే అనిపించేంతగా, ఫస్టాఫ్‌లోని ప్రతి క్యారెక్టర్‌కు, ప్రతి సీన్‌కు కన్‌క్లూజన్ ఇస్తూ ఈ కథ ఔరా అనిపిస్తోంది. చాలా మంది ఇదే 'బాహుబలి2'కథ అని బలంగా నమ్ముతున్నారు. నిజానికి ఎందరో క్రియేటర్స్ వెలుగులోకి రావడం లేదని, బాహుబలి2 కథని సోషల్ మీడియాలో చదివితే నిజం అనిపించడం వాస్తవం.