Advertisement
Google Ads BL

విద్యార్ది సంఘాలు కూడా విజ్ఞతతో ఆలోచించాలి..!


దళితులు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాల వారి రిజర్వేషన్స్‌ విషయాన్ని సమర్థిస్తూ, ఇంకా ఇంకా తమకు అవకాశాలు కల్పించాలనే కథతో, కుల విమర్శలతో 'శరణం గచ్చామి' చిత్రం రూపొందినట్లు సమాచారం. సినిమా చూడకుండానే ఓ నిర్ణయానికి రావడం తప్పు కాబట్టి ఈ విషయంలో ఇక విశ్లేషణ అనవసరం. కానీ ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ కొంతకాలం కిందట సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఓ వర్గం వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, కాబట్టి శాంతిభద్రతల సమస్య రావచ్చని సెన్సార్‌ సభ్యులు భావించారు. కానీ కొన్ని విద్యార్థి, కుల యువత సంఘాలు ఈ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేట్‌ నిరాకరించడంతో ఆగ్రహించి, సెన్సార్‌బోర్డ్‌ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 

Advertisement
CJ Advs

దాంతో సెన్సార్‌బోర్డ్‌ వెంటనే హడావుడిగా ఈ చిత్రాన్ని చూసి, చిన్న చిన్న మార్పులతో యు/ఎ సర్టిఫికేట్‌ను మంజూరు చేయడం హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే భావప్రకటనా స్వేచ్చ పేరుతో మనకు రాజ్యాంగం అలాంటి హక్కులను ఇవ్వడమే. అయితే ఇక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ ఏ ఒక్క కులానికో, వర్గానికో సంబంధించినది కాదు... అందరికీ అది వర్తిస్తుంది. గతంలో అగ్రవర్ణాలలోని పేదల కడగండ్లను తెరపై చూపిస్తూ ' ఈ చదువులు మాకొద్దు, పోలీస్‌ భార్య' వంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలపై దళిత, బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల వారు ఆందోళనలు నిర్వహించి, ఆ చిత్రాలలోని ఎన్నో సీన్స్‌ను సినిమా రిలీజ్‌ చేసిన తర్వాత కూడా అల్లర్లు, ఆందోళనలు చేసి, దాదాపు ఆ చిత్రాలలోని ముఖ్య సారాంశాన్ని చూపించే సన్నివేశాలను కట్‌ చేయించారు. ఇది తప్పు. అగ్రవర్ణాల బాధలను చెప్పుకునే హక్కు వారికి కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో అలాంటి చిత్రాలు వచ్చినప్పుడు ఈ సోకాల్డ్‌ కుల, రాజకీయ, విద్యార్థి సంఘాలు కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs