Advertisement
Google Ads BL

మంచు మనోజ్ కి చిరు హెల్ప్ అవుతాడా..?


ఎనర్జిటిక్ స్టార్ మంచు మనోజ్ తాజా చిత్రం 'గుంటూరోడు' మార్చి మూడున విడుదలకు సిద్ధమయ్యింది. ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో బిజీగా వున్న మనోజ్ 'గుంటూరోడు' చిత్రం గురించి ఆసక్తికర విషయాలు కొన్ని మీడియాతో పంచుకున్నాడు. ఈ  'గుంటూరోడు' చిత్రంలో చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పిన విషయం తెల్సిందే. అయితే మొదటగా ఈ వాయిస్ ఓవర్ ని మనోజ్ తన ఫ్రెండ్ రామ్ చరణ్ తో చెప్పిస్తే బావుంటుందని చరణ్ ని అప్రోచ్ అవ్వగా దానికి రామ్ చరణ్ కూడా ఓకె చెప్పాడంట. అయితే చరణ్ వేరే ఊరిలో ఉండడంతో చరణ్ వాయిస్ ని తీసుకోలేక పోయారట.

Advertisement
CJ Advs

సరే చరణ్ ది కాకపోయినా చిరుగారితో అయినా వాయిస్ ఓవర్ చెప్పించాలని మనోజ్ బ్రేక్ ఫాస్ట్ టైం కి చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయనతో అంకుల్ మీరు నాకొక చిన్న హెల్ప్ చేసిపెట్టాలని ఆయన్ని అడగగా... ఏంటో చెప్పు చేద్దామని అన్నారు. నేను వెంటనే 'గుంటూరోడు'లో మీ వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే అయన సరే అలాగే చేద్దామని చెప్పి... నాకు తెలియకుండానే అయన 'గుంటూరోడి'కి వాయిస్ ఓవర్ ని ఇచ్చేసారు. ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి మనోజ్ ఒకసారి నేను చెప్పిన వాయిస్ ఓవర్ చెక్ చేసుకో బాగోపోతే మరోసారి చెబుదాం అని చెప్పి షాక్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. మరి మనోజ్ 'గుంటూరోడి'కి చిరు వాయిస్ ఓవర్ ఏ మాత్రం హెల్ప్ చేస్తుందో మార్చి మూడు వరకు వైట్ చెయ్యాల్సిందే.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs