Advertisement
Google Ads BL

పబ్లిసిటీ కోసమేనా ఈ అంనౌన్సమెంట్స్..?


మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కే బైలింగ్యువల్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదలై అప్పుడే చాలా నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఈ చిత్రపై ఎటువంటి న్యూస్ బయటికిరాలేదు. అసలు టైటిల్ గాని మహేష్ లుక్  గాని ఇంతవరకు బయటకి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ మహేష్ ఫ్యాన్స్ దగ్గర నుండి సగటు ప్రేక్షకుడు వరకు మహేష్ బాబు చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్యలో మహేష్ కొత్త చిత్రం టీజర్ ని చాలా బడ్జెట్ తో విదేశాల్లో కట్ చేపిస్తున్నారని త్వరలోనే ఆ టీజర్ ని విడుదల చేస్తారని అన్నారు. కానీ అదేం లేనట్టే ఉంది... వాతావరణం చూస్తుంటే. 

Advertisement
CJ Advs

అసలు టైటిల్ గురించిగాని, ఫస్ట్ లుక్ గురించి గాని ఇంతవరకు డైరెక్టర్ గరుగాని, హీరోగారు గాని స్పందించి సమాధానం చెప్పడం లేదు. ఇక ఇప్పుడు వాటికే దిక్కులేదు గానీ మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తున్నాం అంటూ....  మా  గెస్టులుగా మారడానికి సిద్దంగా ఉండండి. జూన్ 23న వచ్చేస్తున్నాం. ఎక్సయిటింగ్ గా ఉంది అని మురుగదాస్ ట్వీట్ చేసాడు. మరి మహేష్ బాబు ఫస్ట్ లుక్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి ఈ విడుదల తేదీ కొంత ఊరట ఇచ్చిందేమో గానీ మిగతా వారు మాత్రం ఉసూరుమంటున్నారు.

డైరెక్టర్ గారు ఫస్ట్ లుక్ విడుదల గురించి చెప్పకుండా ఇలా విడుదల తేదీ గురించి చెప్పడం ఏమిటబ్బా అని అందరూ పెదవి విరుస్తున్నారు. మరి అంతగా మహేష్ చిత్ర ఫస్ట్ లుక్ వదలడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు. అంటే ఇలా ఏ విషయాన్నీ బయటికి వదలకుండా సినిమా మీద హైప్స్ పెంచాడనికి ఇలాంటి ప్లాన్ చేస్తున్నారా? లేదంటే సినిమా విడుదలకు ఇంకా నాలుగు నెలల టైమ్ వుంది కాబట్టి ఆ ఫస్ట్ లుక్ ఏదో ఉగాదికి విడుదల చేస్తే బావుంటుందని  అనుకుంటున్నారా? ఏమో ఏది ఎలాగున్నా ఈ మహేష్ లుక్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిస్పాయింట్ అయ్యారని సమాచారం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs