Advertisement

కేసీఆర్‌ని అలా విమర్శించడం తప్పు...!


కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శిస్తే దానికి ఒక అర్ధం ఉంది. కానీ ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు, అంతకు ముందు యాగం వంటి వాటితో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొందరు వామపక్షనేతలు, కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం. ఈ కుహనా సెక్యులర్‌ వాదులు హజ్‌యాత్రల పేరుతో ముస్లింలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నప్నుడు ఎందుకు మాట్లాడలేదు? ముస్లింలు హజ్‌కి వెళితే హిందువులకు, ఇతర మతస్థులకు పుణ్యం, పురషార్ధం వచ్చేస్తాయా? లేక క్రిస్టియన్లు జెరూసలెంకో, రోమ్‌కో వెళితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందా? మరి హిందువులను కూడా కాశీకో, హిమాలయాలకో తీసుకెళ్తే ఊరుకుంటారా? ఏమిటీ అన్యాయం, మైనార్టీల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఈ నేతలకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత ఉందా? అసలు మైనార్టీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరమా? మైనార్టీ వ్యవహారాల శాఖను మార్చి వేసి, సర్వమత సమన్వయ శాఖను ఏర్పాటు చేయండి...!

Advertisement

తిరుమల మొక్కులు చెల్లిస్తేనే ఇంతగా ఫీలయిపోతున్న నాయకులు మైనార్టీ మతస్థుల విషయంలో మౌనం పాటిస్తారు. ఒక శివసేనను, ఆర్‌ఎస్‌ఎస్‌ను, బిజెపిని, విహెచ్‌పిని విమర్శించే వీరు ఎంఐఎం, ముస్లింలీగ్‌ వంటి పార్టీలతో పొత్తుకు తహతహలాడుతారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా లౌకిక వాదం? ఇదేనా సెక్యులరిజం? ఎవరు చెప్పారు వారికి? ప్రతి కులానికి ప్రత్యేక కార్పొరేషన్స్‌, ఫండ్‌లను పెడుతున్నారు? బిసిలకు, కాపులకు, బ్రాహ్మణులకు.. ఇలా విడివిడిగా కులాల పేరుతో, మైనార్టీ సంక్షేమం పేరుతో కార్పొరేషన్లు స్థాపిస్తున్నారు. ఇలా విడదీసి పాలించడం ఎంతకాలం? దీనికి హద్దుఅదుపు ఉండదా? అంబేడ్కర్‌ విగ్రహం కోసమో, గౌతమబుద్దుడి విగ్రహం నమూనా కోసమో ఏకంగా మంత్రులు, అధికార బృందాలు చైనా, జపాన్‌ వంటి దేశాలలో పర్యటించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? చంద్రబాబు అమరావతి శంకు స్థాపనను ఎన్ని సార్లు అట్టహాసంగా జరిపారో ప్రతిపక్షాలకు తెలియదా? ఓ రెడ్డి కులస్తుడో, ఇతర కులస్తుడో క్రైస్తవ మతం పుచ్చుకుని, తమ పేరుకు ముందు మాత్రం రెడ్డి అని తగిలించుకోవడం న్యాయమేనా? నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరకు వీరందరూ క్రిస్టియన్‌ మతం పుచ్చుకుని, అటు క్రిస్టియన్లను, ఇటు రెడ్లను కూడా తమ వైపుకు తిప్పుకునే రాజకీయాలను ఏమని పిలవాలి? ఇది దేశానికి, దేశసమగ్రతకు మంచిది కాదు. అసలు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అనే తేడా లేకుండా పుణ్యక్షేత్రాల దర్శనాలకు, మొక్కుల చెల్లింపుకు ప్రజల ధనాన్ని వృథా చేయకూడదని, ఏ మతం వారిని ప్రత్యేకంగా చూడకూడదని ఈ కుహనా మేథావులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement