Advertisement
Google Ads BL

జెపి కూడా తక్కువేం కాదు..!


లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణను ఎందరో గౌరవిస్తారు. ఓ మేథావిగా ఆయన్ను గుర్తిస్తారు. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ జెపి మీద కొన్ని ఆరోపణలు వున్నాయి. నాటి గొప్ప వ్యక్తి జయప్రకాష్‌ నారాయణ్‌ పేరు పెట్టుకున్న ఈయన ఐఏయస్‌ పదవిని కూడా తృణప్రాయంగా భావించి వదిలేశారు. మొదట్లో కులం కంపు కొట్టే ఈనాడు అధినేత రామోజీరావు అండ్‌ కో ఆయనను బాగా పొగిడే వారు. ఈటీవీలో, ఈనాడు పత్రికలో ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా అదే సామాజిక వర్గం వాడు కావడంతో జెపితో పాటు చంద్రబాబుకు కూడా భజన చేసేవారు. కానీ ఎప్పుడైతే జెపి 'లోక్‌సత్తా'ను రాజకీయపార్టీగా మార్చాడో ఆనాటి నుంచి రామోజీరావు అండ్‌ కో జెపిని దూరంగా పెట్టారు. కేవలం చంద్రబాబుని మాత్రమే అక్కున చేర్చుకున్నారు. దీనికి కారణం ఎవరికైనా తెలుసా? జెపి కూడా చంద్రబాబు కులం వాడే కావడంతో జెపి వల్ల చంద్రబాబుకు పడే ఆ సామాజిక వర్గం ఓట్లను జెపి చీలుస్తాడని, మేథావులైన, నిస్వార్థపరులైన కమ్మవారు బాబు కంటే జెపిని ఎక్కువగా ఆదరిస్తారని బాబు, రామోజీరావులు భావించారు. ఇక జెపికి కులపిచ్చి ఉందని రాస్తే చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ ఆ పార్టీలో పనిచేసే వారిని, ఆయనను బాగా దగ్గరగా చూసిన వారిని అడిగితే నిజం చెబుతారు. ఇక ఏ ఆధారం లేకుండా జెపిపై ఆరోపణ చేయలేదు. జయప్రకాష్‌నారాయణ్‌ అప్పట్లో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో టిడిపి అధికారంలో ఉంది. ఆయన ఇన్‌డైరెక్ట్‌గా స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ఉన్న కేవలం కుల ప్రేమతోనే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడని, ఆయన తన సామాజిక వర్గానికి చెందిన వారికి, అనర్హులకు కూడా ఎంతో సహాయం చేశాడని ఆరోపణలున్నాయి. ఒకసారి ఓ విలేకరి జెపి వంటి నాయకులు సమాజానికి అవసరం.. అని వాదిస్తున్న క్రమంలో జెపి ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో, అధికార తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఓ సీనియర్‌ మంత్రి జెపిని అంత మంచిగా భావించవద్దని కోరాడు. తన వద్ద ఆనాడు జెపి కేవలం అనర్హులైన కమ్మవారికి కూడా ఎంత సాయం చేశాడు? పక్క కులం వారికి అన్ని అర్హతలు ఉన్నా వారికి ఎందుకు సాయం చేయలేదో ఆ మాజీ మంత్రి ఆధారాలతో సహా చూపించాడు. సో పైకి కనిపించేదంతా మంచే అనుకునే వారు.. అన్నిటిని గుడ్డిగా నమ్మకూడదు. నేటి కాల పరిస్థితుల్లో అస్సలు ఎవరిని నమ్మడానికి లేదు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs