Advertisement
Google Ads BL

చిరు ఫ్యాన్స్‌ వీటికి సమాధానం చెబుతారా..?


చిరంజీవి సినిమాలలో నెంబర్‌వన్‌. ఆయనే మెగాస్టార్‌. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన చిత్రాలను అందరూ ఆదరిస్తారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన పట్టుదలకు వంగి వంగి సలాంలు కూడా చేయవచ్చు. కానీ ఆయన రాజకీయంగా ఎవ్వరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. తన పిఆర్‌పి పార్టీని తాకట్టు పెట్టి, సోనియా కాళ్ల ముందు పెట్టాడు. ఈ విషయాన్ని రాస్తే ఆయన అభిమానుల స్పందన చాలా చిత్రంగా ఉంది. అసలు రాసిన వాడికి వారి అమ్మ, నాన్న ఎవరో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చిరు పార్టీని అమ్ముకున్నాడని నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించు అని చాలెంజ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయం అర్ధం చేసుకోవాలి. వారి వీరాభిమానం అలాంటిది. తప్పును తప్పు అని అంగీకరించి, తమ హీరోలకు సైతం ఆదర్శంగా నిలిచి, నిజమైన విమర్శలను చేసే వారికి మార్గదర్శకంగా నిలవాలే గానీ వీరాభిమానంతో ఆయన ఏమి చేసినా కరెక్టే అని మూర్ఖంగా ఆలోచించడం తగదు. అది విజ్ఞత అనిపించుకోదు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. 

Advertisement
CJ Advs

ఓ మహానుభాహుడు చెప్పినట్లు 'తల్లి వాస్తవం... తండ్రి నమ్మకం'. ఇది నాకే కాదు.. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, చిన్నప్పటి నుంచి మన తల్లి ఎవరిని చూపించి నాన్నా అని పిలవమని చెబితే, వారే మన నాన్న అనే నమ్మకం వస్తుంది. ఇక సాక్ష్యాలు లేనివన్నీ నిజాలు కాకుండా పోవు...! మరి చిరు సోనియాకు తాకట్టుపెట్టాడు అంటే సాక్ష్యం చూపించమంటున్నారు. మరి అమ్ముడుపోలేదనడానికి, తన స్వార్థం కోసం, కేంద్రమంత్రి పదవి కోసం అలా చేయలేదని నిరూపించే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో అధిక శాతం ప్రజలు ఏం నమ్ముతున్నారో? అదే నిజమని భావించాలి.

బాలకృష్ణ నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి' కి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపునిచ్చాయి. దాంతో చిరు అభిమానులు ఆ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం తప్పని.. ప్రజల సొమ్మును ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని విమర్శలు చేశారు. మరి మీదే నిజమని ఒప్పుకుందాం. మరి చిరు 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌150'కి వచ్చిన కలెక్షన్లపై ఇప్పటికీ అందరికీ సందేహాలున్నాయి. ఈ చిత్రం 150కోట్లు వసూలు చేసిందని అల్లుఅరవింద్‌తో పాటు ఆయన అభిమానులు భావిస్తున్నారు. కానీ చరణ్‌ ఐటి అధికారులకు కేవలం 75కోట్లు మాత్రమే చూపించినట్లు పలు పత్రికల్లో వచ్చింది. మరి ఈ కన్‌ఫ్యూజన్‌కు తెరదించుతూ నిర్మాత ఏరియాల వారీగా, థియేటర్ల వారీగా ఎక్కడ ఎంత కలెక్ట్‌ చేసిందో ఇప్పటికీ ఇన్ని వివాదాలు, విమర్శలు వస్తున్నా.. ఎందుకు ప్రకటించడం లేదు? నిజంగా 150కోట్లు వసూలు చేస్తే లెక్కలు, సాక్ష్యాలు చూపించండి. కానీ కేవలం ఐటి నుంచి తప్పించుకోవడానికే చరణ్‌ తన చిత్రం వసూళ్లను తక్కువ చేసి, కేవలం 75కోట్లు మాత్రమే చూపిస్తున్నాడని మరికొందరు చిరు ఫ్యాన్స్‌ కుంటిసాకులు చెబుతున్నారు. మరి అదే నిజమైతే బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యునిగా, అందునా 'పెద్దల సభ'గా పిలవవడే సభను ప్రాతినిధ్యం వహిస్తూ, కేంద్ర మంత్రి పదవిలో కూడా పనిచేసిన చిరు అలా తప్పుడు లెక్కలతో, తక్కువ కలెక్షన్లు, ఎక్కువ రెమ్యూనరేషన్స్‌ చూపిస్తూ, స్వయాన తన తనయుడు చరణ్‌ నిర్మాతగా వున్న చిత్రానికి ఇలా దొంగతనంగా ఐటి ఆదాయం ఎగ్గోట్టే ప్రయత్నం చేసి వుంటే అది ఇంకా పెద్ద తప్పు.. దయచేసి 'ఖైదీ' చిత్రం వసూళ్ల సాక్ష్యాలను నిర్మాత పబ్లిక్ గా తెలియజేస్తే చిరుపై, మెగా ఫ్యామిలీపై మరింత అభిమానం పెరిగే అవకాశం వుంది. లేదంటే..చిరు ని కూడా ఆ లెక్కలో వేయక మానరు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs