Advertisement

స్టార్స్‌ చిత్రాలకు మరో ఆదాయ వనరు..!


స్టార్‌హీరోల చిత్రాలంటే.. సినిమా ఎలా ఉన్నా అద్భుతమైన ఓపెనింగ్స్‌ వస్తాయి. కాస్త యావరేజ్‌ టాక్‌ వచ్చినా నిర్మాతకు కనకవర్షమే. ఇక ఈ చిత్రాలకు సంబంధించిన ఆడియో రైట్స్‌, థియేట్రికల్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ అన్నీ ముందే అమ్ముడైపోతాయి. ఇక సినిమా బాగుంటే నిర్మాతలకు రీమేక్‌ రైట్స్‌ రూపంలో పలు భాషల నుంచి ఫ్యాన్సీ రేట్లు వస్తాయి. తాజాగా మనకు ఓవర్‌సీస్‌ రైట్స్‌కు కూడా భారీ మొత్తాలు లభిస్తున్నాయి. దీంతో ఓ మంచి స్టార్‌ హీరో డేట్స్‌ దొరికాయంటే మాత్రం ఇక ఆ నిర్మాత పంట పండినట్లే. సినిమా విడుదలకు ముందే టేబుల్‌ ప్రాఫిట్స్‌ వస్తాయి. కాగా ఇంతకాలం మన స్టార్‌ చిత్రాల మేకర్స్‌ శాటిలైట్‌ రైట్స్‌తో పాటు డిజిటల్‌ రైట్స్‌ కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మరో కొత్త ఆదాయవనరు నిర్మాతలకు మరింత లాభాలను తేవడం ఖచ్చితమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు శాటిలైట్‌తోనే డిజిటల్‌ రైట్స్‌ ఇవ్వకుండా, వాటిని వేరుగా అమ్ముతున్నారు. దీనివల్ల శాటిలైట్‌ రైట్స్‌ కొన్న వారికి కాస్త నష్టమే కానీ నిర్మాతకు మాత్రం లాభాల పంటే. 

Advertisement

ఇప్పటికే అమేజాన్‌, హాట్‌స్టార్‌ వంటి సంస్థలు డిజిటల్‌ రైట్స్‌ కోసం పోటీ పడటం ప్రారంభించాయి. దీనికి మంచి ఉదాహరణ తాజాగా విడుదలై మంచి కలెక్షన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్న పివిపి సంస్థ నిర్మించిన 'ఘాజీ' చిత్రం. కాగా ఈ చిత్రంలో పెద్దగా పేరులేని, ఇమేజ్‌లేని రానా నటించాడు. సంకల్ప్‌ అనే కొత్త కుర్రాడు తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రానికి టెక్నికల్‌గా బాగానే ఖర్చయి ఉంటుంది కానీ.. రెమ్యూనరేషన్స్‌ పరంగా పెద్ద బడ్జెట్‌ ఏమీ లేదు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళభాషల్లో కూడా ఒకేసారి నిర్మించారు. దీంతో థియేట్రికల్‌ రైట్స్‌కు మూడు భాషల్లోనూ మంచి డబ్బులే వచ్చాయి. ఇక మూడు భాషల్లోనూ శాటిలైట్‌ రైట్స్‌కు కూడా మంచి ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ రైట్స్‌ను అమేజాన్‌ సంస్థ 10కోట్లకు తీసుకుంది. మరి రానా చిత్రమే ఇంత వసూలు చేస్తే ఇక నిజమైన స్టార్స్‌ చిత్రాలకు ఆ రేటు ఎంత భారీగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement