Advertisement
Google Ads BL

అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదేనా?


గత రెండ్రోజులుగా మీడియాలో అఖిల్ పెళ్లి రద్దయిందనే వార్త సంచలనం రేపుతోంది. అఖిల్ - శ్రీయ భూపాల్ ఇద్దరు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది. అసలు రెండేళ్ల నుండి ప్రేమించుకుని డేటింగ్ చేస్తున్న ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని త్వరలోనే విదేశాల్లో పెళ్ళికి సిద్దమైన వీరు ఇప్పుడు సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమేమిటి అని అందరూ తెగ ఇదై పోతున్నారు. ఇక నాగార్జున ఫ్యామిలీ గాని, జివికె ఫ్యామిలీ గాని ఈ పెళ్లి రద్దయిన విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అసలేం జరిగింది ఈ పెళ్లి రద్దవ్వడానికి కారణాలేమిటి? అనే విషయాలను మీడియాకి ఎంతో కొంత తెలిస్తే తప్ప ఈ రూమర్స్ ఆగేలా లేవు. అసలు సోషల్ మీడియాలో అఖిల్ పెళ్లి రద్దు అనే మేటర్ ని ప్రముఖంగా రాసేస్తున్నారు చాలామంది. అసలింత జరుగుతున్నా నాగార్జున ఎందుకు మీడియాకి ముఖం చూపించలేక పోతున్నాడు. అంటే మీడియాలో జరిగే ప్రచారం నిజమేనా? అని అనిపించకమానదు.

Advertisement
CJ Advs

అసలు అఖిల్ కి శ్రీయ భూపాల్ కి ఆ మధ్యన సుబ్బరామిరెడ్డి మనవడు పింకీ రెడ్డి కుమారుడి పెళ్లిలోనే ఏదో గొడవైందని..... ఇక అప్పటినుండి వీరి మధ్యన విభేదాలు తలెత్తాయని... తాజాగా అఖిల్, శ్రీయ లు ఎయిర్ పోర్ట్ లో గొడవ పడ్డారనే అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు గాని... అఖిల్, శ్రీయ, శ్రీయ తల్లి ముగ్గురు పెళ్లి పనుల కోసం ఇటలీకి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్  కి చేరుకోగా... అక్కడ శ్రీయ భూపాల్ ని ఫొటోస్ కి ఫోజ్ ఇవ్వాల్సిందిగా అఖిల్ కోరగా శ్రీయ మాత్రం అఖిల్ మాట వినకుండా ముందుకు వెళ్లిపోవడంతో అఖిల్ అప్పుడే శ్రీయ తో గొడవ పడడంతో ఈ పెళ్లి రద్దయిందనే ఒక వార్త ఇప్పుడు మీడియాలో హైలెట్ అయ్యింది. ఇక అఖిల్ శ్రీయ గొడవని ఆపాలని శ్రీయ తల్లి ఏ మాత్రం ట్రై చెయ్యక పోవడంతో అఖిల్ పెళ్లిని రద్దు చేసుకున్నాడని అంటున్నారు.

అఖిల్ ఇంటికి వచ్చి నాగార్జున కి జరిగింది చెప్పగా నాగ్, శ్రీయ - అఖిల్ కి సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేయగా వీరు పెళ్లిని ని బ్రేక్ చేసుకోవడానికే సుముఖత చూపడంతో ఈ పెళ్లిని తప్పనిసరి పరిస్థితుల్లో క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చిందని అంటున్నారు. 

ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా మరోపక్క నాగ చైతన్య - సమంతలు త్వరగా పెళ్ళిచేసుకుని సెటిల్ అవ్వమని అక్కినేని ఫ్యామిలీ వారిపై వత్తిడి తెస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ఇప్పటికే వీరు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి కొద్దీ టైం కావాలని అడగడంతో నాగార్జున ఒప్పుకున్నాడట. కానీ ఇప్పుడు అఖిల్ - శ్రీయ భూపాల్ వ్యవహారంలో నలిగిపోతున్న నాగ్, నాగ చైతన్య విషయంలో కూడా ఇలాంటిది ఏదో ఒకటి జరిగే వరకు పెళ్లి వాయిదా వేయకూడదని అందుకే త్వరలోనే వీళ్ళపెళ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరి ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడం అంటే ఇదేనేమో. పాపం టాలీవుడ్ లో డీసెంట్ మ్యాన్  గా పేరు తెచ్చుకున్న నాగ్.. కొడుకుల వల్ల వీధికెక్కాల్సి వచ్చిందని అనుకుంటున్నారు అందరూ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs