Advertisement
Google Ads BL

మహేష్, చైతు ప్లాప్స్ పై రకుల్ కామెంట్స్..!


రకుల్ ప్రీత్ సింగ్ అందరిలా కాకుండా తాను మనసులో ఏం అనుకుంటే దానిని బయటికి చెప్పేస్తుంది. ఆ మాట అన్నది ఎవరో కాదు అక్షరాలా రకుల్ ప్రీతే. అయితే ఇప్పుడు రకుల్ అలా మనసులో దాచుకోకుండా చెప్పిన విషయాలు ఏమిటంటే.... తాను డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక రెండు సినిమాల్లో అవకాశం వదులుకుందట. అయితే అప్పుడు ఆ అవకాశాలు చేజారినప్పుడు కొంచెం ఫీల్ అయినా ఆ రెండు సినిమాలు  ప్లాప్ అయినప్పుడు మాత్రం తెగ సంతోషించిందట. 

Advertisement
CJ Advs

అయితే ఆ సినిమాలు పేర్లు కూడా ధైర్యం గా చెప్పేసింది. ఒకటి మహేష్ హీరోగా తెరకెక్కి డిజాస్టర్ గా నిలిచిన 'బ్రహ్మోత్సవం'. ఆ  సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ నే సంప్రదించారట. అయితే అప్పుడు రకుల్ కి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక ఆ సినిమాలో చేయలేదట. ఇక రెండోది నాగ చైతన్య కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ 'ఆటో నగర్ సూర్య'. దీనిలో కూడా రకుల్ ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట. కానీ అప్పుడూ డేట్స్ ప్రాబ్లెమ్ రావడంతో ఆ సినిమాలో అవకాశం వదులుకోవాల్సి వచ్చిందట. ఇక పొతే ఆ రెండు సినిమాల ఛాన్స్ లు వదులుకోవడంతో అప్పట్లో చాలానే బాధ పడిందట. కానీ ఆ సినిమాలు రెండూ డిజాస్టర్ అవడంతో హమ్మయ్య వాటిల్లో నటించకపోవడమే మంచిది అనుకున్నాను....... అని అంతా ఓపెన్ గా చెప్పేస్తుంది.

అయితే అప్పట్లో ఆ ఇద్దరి హీరోలతో ఛాన్స్ మిస్ అయితే అయ్యింది గాని ఇప్పుడు మళ్లీ మహేష్ కి జోడిగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చే చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అలాగే నాగ చైతన్య - కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో కూడా అవకాశం దక్కించుకున్న రకుల్ ఇప్పుడు అలా మాట్లాడడం ఏమిటో అని అందరూ పెదవి విరుస్తున్నారు. అయితే రకుల్ మాత్రం అప్పుడు నేను మిస్సయిన ఆ ఇద్దరి హీరోలతో మళ్లీ ఛాన్స్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని చెబుతుంది.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs