Advertisement
Google Ads BL

నిన్న చంద్రబాబు.. నేడు కేసీఆర్‌...!


మనది పేరుకే ప్రజాస్వామ్యం... కానీ దీనిలో నిజం లేదు. ఎన్నికల ముందు వరకు ఒకలా మాట్లాడే నాయకులు, పదవులు దక్కిన తర్వాత మాత్రం నియంతల్లా వ్యవహరిస్తుంటారు. వీరు హిట్లర్‌ని మించిన శాడిస్టులు. హిట్లర్‌ చేసిన దాంట్లో దేశభక్తి ఉంది. కానీ మన నాయకుల్లో తమ స్వార్థం తప్ప మరో ఎజెండా ఉండదు. దీనికి ఎందరినో ఉదాహరణగా చూపించవచ్చు. వారు కోకొల్లలు. కాగా ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే చంద్రబాబు, కేసీఆర్‌లు సీఎంలు అయ్యాక చేస్తున్న, తీసుకుంటున్న నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి. అందరి గొంతు నొక్కేయాలని భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

'ప్రత్యేకహోదా' కోసం ఏపీ యువత శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చినా కూడా శాంతిభద్రతల పేరుతో దానిని పైశాచికంగా అణిచివేసి, అరెస్ట్‌లు చేశారు. దీనికి వారు చెబుతున్న కారణాలు వింటే నవ్వురాక మానదు. చంద్రబాబు, ఆయన భజనపరులు రిపబ్లిక్‌డే రోజున ఆందోళన జరపకూడదని, పోలీసుల నుంచి అనుమతిలేదని చెబుతూ, వైజాగ్‌లో భయానక వాతావరణం సృష్టించాడు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తి పోరాటం చేయాలని భావిస్తున్న మేథావి ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు జేఏసీ నేతలను, కార్యకర్తలు అరెస్ట్‌లు చేయిస్తూ, తాను మాత్రం లార్డ్‌ వేంకటేశ్వరస్వామి సేవలో తిరుమలలో తరిస్తున్నాడు. 

మరోపక్క కోదండరాం నుంచి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. నిరసన అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వైజాగ్‌లో ఆందోళనకు ఎలాంటి అనుమతులు లేవని చంద్రబాబు చెబితే, నేడు అనుమతిని కోరిన తెలంగాణ జేఏసీ నేతలకు పోలీసుల అనుమతి లభించలేదు. దీనికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్న వంక చూస్తే.. ఔరా అనిపిస్తుంది. ఇది విద్యార్ధులకు పరీక్షల సమయం కాబట్టి నిరుద్యోగులతో నిరసన తెలిపితే విద్యార్ధుల ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. జేఏసీ నేతలపై పలు కేసులు ఉన్నాయని వాదిస్తున్నారు. కానీ కోదండరాం నుంచి జేఏసీ నేతలందరిపై చూపుతున్న కేసులు వింటే ఆశ్చర్యం వేస్తుంది. 

ఇవ్వన్నీ ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ నాయకులపై, కార్యకర్తలపై, యువతపై పెట్టిన కేసులే. మరి అలాంటి కేసులు కేసీఆర్‌తో పాటు ప్రభుత్వంలోని చాలా మందిపై ఉన్నాయి. మరి కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు విద్యార్ధులు, ఉద్యోగులకు ఇబ్బందులు కలగలేదా? ఇక బాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విద్యుత్‌ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై కాళ్లకు గురి పెట్టకుండా, గుండెలపై గురి పెట్టి, కాల్పులు జరిపించి, ఎందరో ఉద్యమకారుల ప్రాణాలను బలి తీసుకున్నాడు. దానికి తగ్గ మూల్యం కూడా చెల్లించాడు. అదే పరిస్థితే రేపు చంద్రబాబుకు, కేసీఆర్‌లకు ఎదురవ్వడం ఖాయం...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs