Advertisement
Google Ads BL

మహేష్ బాబు జల్లికట్టు మద్దతు కి కారణం ఇదే..!


తమిళనాడులో జల్లికట్టు సమస్య తీవ్రమైనప్పుడు అక్కడి సినీపరిశ్రమ అంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడింది. ఒక్క తమిళ పరిశ్రమ మాత్రమే కాకుండా ఇక్కడి టాలీవుడ్ హీరోలు సైతం జల్లికట్టు తమిళుల హక్కు అని తమ మద్దతు తెలిపారు. అయితే ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జల్లికట్టు కు తన మద్దతుని ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. అయితే ఎప్పుడూ ఏ విషయంలోనూ స్పందించని మహేష్ ఒక్కసారిగా జల్లికట్టుని సమర్ధించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మహేష్ బాబు - మురుగదాస్ డైరెక్షన్ లో తమిళంలోనూ, తెలుగులోని బైలింగ్యువల్ లో నటించడం వలన తమిళులకు తన మద్దతు ప్రకటించాడని అనుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ ఆ జల్లికట్టుకు మద్దతు తెలపడానికి కారణం వేరే ఉందట. అదేమిటంటే మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో జల్లి కట్టు సమస్యను తమిళులు  సామరస్యం గా ఎదుర్కొన్నారో అలాగే మహేష్ చిత్రంలో కూడా క్లైమాక్స్ సీన్ లో అలాంటి ఒక సీన్ ని మురుగదాస్ పెట్టాడట. మెరీనా బీచ్ లో  శాంతియుత ఆందోళన చేసి జల్లికట్టును సాధించుకున్న తమిళ మనోభావాలు కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని సీన్స్ ఉండేలా మురుగదాస్ ప్లాన్ చేసాడట.

మరి ఇప్పటివరకు జల్లికట్టు గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా..... ఈ మధ్యన  తమిళనాడు చెన్నైలో జరిగిన జల్లికట్టు ఆందోళనల నేపధ్యం లో జల్లికట్టు అంటే మొత్తం దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయమైంది. మరి అలాంటి వాటిని తమ చిత్రంలో చూపెట్టడం వల్ల సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని మహేష్, మురుగదాస్ లు భావించారని అంటున్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో తమిళ హీరో భరత్ కనిపించనున్నాడు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs