Advertisement
Google Ads BL

పవన్‌..వారిని గుడ్డిగా నమ్ముతున్నాడా..!


అభిమానం వేరు.. వీరాభిమానం వేరు.. అవకాశవాదం ఇంకా వేరు.. వీటిని జాగ్రత్తగా కనిపెట్టడం ఎవ్వరి తరమూ కాదు... ఇక పవన్‌పై తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్‌ పవన్‌ చుట్టూ కొందరు మాఫియాలాగా తయారయ్యారని, వారు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కు వచ్చిన నష్టానికి పరిహారంగా 'కాటమరాయుడు' రైట్స్‌ను ఇస్తామని చెప్పిన నిర్మాత, పవన్‌ స్నేహితుడు శరత్‌మరార్‌.. ఇప్పుడు మాట మారుస్తున్నాడని, ఈరోస్‌ సంస్థపైకి అన్నింటినీ నెట్టివేస్తూ.. తమకు 'కాటమరాయుడు' డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ఇవ్వడం లేదని, కానీ ఈ విషయం పవన్‌కి తెలియదని, ఆయన చుట్టూ ఉన్న వారు తమను పవన్‌ని కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' విషయంలో తాము నాన్‌ రికవరబుల్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన మాట నిజమేనని ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు అలా సంతకం పెట్టాల్సి వచ్చిందో, పవన్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తమను ఎలా కన్విన్స్‌ చేసింది చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆయన ఆవేదన నిజమే. 

Advertisement
CJ Advs

కానీ సినిమా అంటే లాభనష్టాలు సహజం. లాభాలు వచ్చినప్పుడు పండగ చేసుకునే డిస్ట్రిబ్యూటర్లు నాన్‌ రికవరబుల్‌ అగ్రిమెంట్లపై కూడా సంతకం చేసి, నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలను, హీరోలను తప్పుపట్టడం సరికాదు. అయినా పవన్‌ అలా నష్టపోయిన వారందరినీ ఆదుకోవడానికి ప్రస్తుతం అదే నిర్మాత శరత్‌మరార్‌కు 'కాటమరాయుడు' చేస్తున్నాడు. కానీ నిర్మాత, పవన్‌ మేనేజర్‌ మాత్రం కొందరిని మోసగిస్తున్నారని గత కొంతకాలంగా మీడియాకు సమాచారం అందుతూనే ఉంది. కానీ సందర్భం లేకుండా ఆధారాలు, సమాచారం లేకుండా విమర్శించడం మంచి పద్దతి కాదనే చాలా మంది మీడియా వారు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. వ్యక్తిగతంగా పవన్‌ చాలా మంచివాడనే ఇండస్ట్రీలో చెబుతారు. కానీ ఆయనను అడ్డుపెట్టుకొని ఆయన మేనేజర్‌ శ్రీనివాస్‌, ప్రాణస్నేహితునిగా పిలవబడుతున్న శరత్‌మరార్‌ వంటి వారు ఆయన్ను పక్కదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. 

అలాగే గతంలో కూడా బండ్ల గణేష్‌, పివిపి వంటి వారు పవన్‌ని 'ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌' చేశారని కూడా విమర్శలున్నాయి. ముందుగా ఇలాంటి భజనపరులను, అవకాశవాదులను పవన్‌ దూరంగా ఉంచాలి. ఇప్పటికే ఆయన కొందరిని దూరం పెట్టి మంచి పని చేశారు. ఆయనకు మద్దతుగా నిలిచిన రాజు రవితేజ విషయమై సరైన సమాచారం లేదు. ఆయనను ఈ మద్య పవన్‌ ఎందుకు దూరంగా ఉంచుతున్నారో తెలియదు. కానీ శరత్‌మరార్‌, పివిపి, మేనేజర్‌ శ్రీనివాస్‌ వంటి వారు పవన్‌ని వాడుకొని వదిలేస్తారు. దీంతో పవన్‌ కూడా చిరంజీవిలా అల్లుఅరవింద్‌, అశ్వనీదత్‌, కె.యస్‌.రామారావు వంటి వారి చేతిలో బంధి అయి, చెడ్డపేరు తెచ్చుకునే అవకాశం ఉంది. పవన్‌.. బహుపరాక్‌...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs