Advertisement
Google Ads BL

నాగార్జున సార్‌.. బాధపడాల్సిన అవసరం లేదు..!


జర్నలిజంలో 'గారు, సార్‌, శ్రీ' వంటి పదాలను వాడకూడదు. కానీ నాగార్జున విషయంలో మాత్రం ఆయన నిజమైన అభిమానులు భాధపడుతున్న విషయాన్ని తెలపాలి కాబట్టే అలా సంబోధించవలసి వచ్చింది. ఏయన్నార్‌ తనయునిగా బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'హీరో'కు రీమేక్‌గా నాగ్‌ నటించిన తొలి చిత్రం 'విక్రమ్‌'. అక్కడి నుంచి ఆయన నటప్రస్ధానం మొదలైంది. మొదట్లో ఆయన సినిమాలను, పీలగొంతును, పర్సనాలిటీని చూసిన వారు 'ఇతనేం.. హీరో' అనుకున్నారు. అలా 'కెప్టెన్‌ నాగార్జు నుంచి ఎన్నో ఎన్నెన్నో చిత్రాలలో ఆయన నటనపై, ఆయన తెలుగు భాషను పలికేతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన మాట వాస్తవం. కానీ కొంతకాలానికే నాగ్‌ ఆ విషయం తెలుసుకున్నారు. 

Advertisement
CJ Advs

'గీతాంజలి, శివ' వంటి చిత్రాలతో తన కెరీర్‌నే కాదు.. తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ను పెంచారు. బడ్జెట్‌ కాస్త ఎక్కువైనా ఫర్వాలేదు.. సినిమాలలో సాంకేతిక పరిజ్ఞానం కూడా ముఖ్యమని ఆయన గ్రహించారు. నిజం చెప్పాలంటే 'గీతాంజలి, శివ'ల ముందు మన హీరోలు పెద్దగా ఫొటోగ్రఫీ, ఆధునిక కెమెరాలు, అద్భుతమైన రీరికార్డింగ్‌ వంటి వాటిని పట్టించుకునే వారు కాదు. కానీ నాగ్‌ ఆ విప్లవాత్మకమైన మార్పును తెచ్చి రాంగోపాల్‌ వర్మ నుంచి లారెన్స్‌, కళ్యాణ్‌కృష్ణ వరకు ఎందరికో డేరింగ్‌గా అవకాశాలు ఇచ్చారు. తాజాగా ఓంకార్‌ దర్శకత్వంలో కూడా చేస్తున్నాడు. వీరిలో వీరభద్రం వంటి వారు ఆయన ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేసి నాగ్‌కు నష్టాలు తెచ్చిపెట్టారు. 

అయినా నాగ్‌ వెనకడుగే వేయలేదు. తాజాగా భక్తిరస చిత్రాలతో కూడా అద్భుతంగా అలరిస్తున్నాడు. 'అన్నమయ్య'లో ముసలి వాడిగా ఆయన చేసిన నటన అత్యథ్భుతం. ఇక తాజాగా కూడా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో కూడా ఆయన ఆ పాత్రలో జీవించారు. మంచి పాజిటివ్‌ టాక్‌, మంచి రివ్యూలు వచ్చినా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. దీనికి అన్‌సీజన్‌తో పాటు అనేక కారణాలున్నాయి. 'కర్ణుడి చావుకు ఎన్నో కారణాలున్నాయి'. అలాగే ఈ చిత్రం ఆడకపోవడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. కానీ ఎప్పుడు జయాపజయాలకు, లాభనష్టాలకు అతీతంగా కనిపించే నాగ్‌ ఈ చిత్రం విషయంలో మాత్రం తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆయన అదే డిప్రెషన్‌ మూడ్‌లో కేవలం ఇంటికే రెండు రోజులు పరిమితమై పోయి, కనీసం బయటకు గానీ, చివరకు ఫోన్‌ కాల్స్‌ను కూడా రిసీవ్‌ చేసుకోలేదని, అందరూ రాంగ్‌టైమ్‌లో రిలీజ్‌ చేయడం నాగ్‌ తప్పు అని బ్లేమ్‌ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. కానీ ఆటుపోట్లు నాగ్‌కు కొత్త కాదు. ఈ చిత్రం ఆడనంత మాత్రాన ఆయన ప్రయోగాలకు, వైవిధ్యభరిత చిత్రాలకు దూరం కావాల్సిన పనిలేదు. ఇప్పటికీ అభిమానులే కాదు.. ప్రతి ఇంట్లోను సామాన్యుల నుంచి అందరూ సినీ ప్రేమికులు ఆయనకు ఇచ్చే పొగడ్త ఒక్కటుంది. ఈ వయసులో కూడా నాగ్‌ ఇంకా ఆ ఫిట్‌నెస్‌ను, గ్లామర్‌ను ఎలా కాపాడుకుంటున్నాడు? ఈ వయసులో కూడా ఆయన తన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌ కంటే యంగ్‌గా కనిపిస్తున్నారు.. అనేది ఆయనకు వస్తున్న కాంప్లిమెంట్‌.. కాబట్టి ఆయన ఇప్పటికీ జయాపజయాలకు అతీతంగానే చిత్రాలు చేయాలని అందరూ భావిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs