Advertisement
Google Ads BL

సెలబ్రిటీస్ పరిస్థితే ఇలా ఉంటే..! సామాన్యుల...?


ఈ మధ్యన మాలీవుడ్ నటి భావన కిడ్నప్ మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన సంగతి మరవకముందే ఇప్పుడు మరో హీరో కుమార్తె కూడా లైంగిక వేధింపులకు లోనయ్యానని ఓపెన్ గా చెప్పేసింది. అసలు ఆకతాయిలు అమ్మాయిలను ఏడిపిస్తూ వారిని అల్లరి చెయ్యడం అనేది మనం రోజు వింటూనే వున్నాం. కానీ సెలెబ్రెటీల విషయంలో ఇలాంటివి విన్నవి చాలా తక్కువ. ఇక ఈ మధ్యన నటి భావన కొచ్చిన్ లో షూటింగ్ ముగించుకుని రాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో కొంతమంది ఆమెను వెంబడించి కిడ్నప్ చేసి అల్లరి చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక హీరోల దగ్గర నుండి హీరోయిన్స్ వరకు ఆ రౌడీలను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ కేసులో ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి ఇంకా మీడియాలో ప్రచారం జరుగుతుండగానే ఇప్పుడు మరో హీరో కుమార్తె కూడా నేను ఇలాగే లైంగిక వేధింపులకు గురయ్యానని ధైర్యం గా మీడియా ముందుకు వచ్చింది.   

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు తమిళ హీరో శరత్ కుమార్ కూతురు హీరోయిన్ వరలక్ష్మి. తనకు కూడా ఒక సందర్భంలో ఇలాగె జరిగిందని చెప్పుకొచ్చింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కి చెందిన ప్రోగ్రామింగ్ హెడ్ తనతో చాలా నీచంగా మాట్లాడి ఇబ్బంది పెట్టాడని... అలాగే వారి మధ్యజరిగిన సంభాషణని చెప్పింది. తాను ఒక టీవీ ప్రోగ్రాం చెయ్యడానికి వచ్చినప్పుడు అది పూర్తవ్వగానే ఆ ప్రోగ్రామింగ్ హెడ్ నా దగ్గరికి వచ్చి  మనం ఎప్పుడు బయటకలుద్దాం..? అని అడిగాడు. అదేమిటి ప్రోగ్రాం అయిపొయింది కదా...ఇంకేదైనా పని మీదా..? అని అడిగగా.... అతను నవ్వుతూ మరోలా చూస్తూ.. లేదు.. పని కాదు. వేరే విషయాలు మాట్లాడాలని అన్నాడు. దానికి నేను క్షమించండి.. దయచేసి వదిలేయండి. అని అక్కడ నుండి వెళ్లిపోయానని... ఒంటరి ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని ఆమె తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

అసలు అలాంటివి ఫేస్ చెయ్యాల్సి వచ్చినప్పుడు ఎవరు మౌనంగా ఉండొద్దని ఎవరైనా పోరాడాలని... ఆ ధైర్యం ఆడపిల్లలకి ఉండాలని పిలుపునిచ్చింది. మరి సెలబ్రిటీస్ పరిస్థితే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏమిటని సినిమా పరిశ్రమ అంతా ప్రశ్నిస్తుంది. ఇక భావన కోసం మలయాళ పరిశ్రమ అంతా ఏకతాటిపై పోరాటానికి దిగింది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs