తమిళనాడు రాష్ట్రంలో క్షణ క్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి ప్రముఖ నటుడు కమల హాసన్ స్పందించాడు. ఈ మధ్య కాలంలో తమిళనాడులోని రాజకీయ వాతావరణంపై ఆయన మండిపడ్డాడు. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయం చాలా జుగుప్సాకరంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా నిన్న అసెంబ్లీలో జరిగిన బల పరిక్ష విషయంలో అక్కడ చోటు చేసుకున్న తంతు, శాసన సభ్యుల దిగజారుడు తనం, అదేవిధంగా పళనిస్వామి గెలుపు వంటి అంశాలపై కమల హాసన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నేర సామ్రాజ్యానికి నేడు తమిళనాడులో నెలకొన్న ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని కమల హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంకా కమల్ మాట్లాడుతూ... శశికళ కుటుంబాన్ని ఓ క్రిమినల్ కుటుంబంతో పోలుస్తూ.. మండి పడ్డాడు. కమల్ తాను ఊహించినట్లుగా ఏమాత్రం జరగలేదని, శశికళ వర్గం నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం తనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని వెల్లడించాడు.
అయితే ఇదే సందర్భంగా కమల్, జయలలిత, శశికళలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శశికల మాత్రమే కాదు మరణించిన జయలలిత కూడా దోషిగానే కోర్టు తేల్చిందని అయితే...ఇటువంటి నేరస్తులతో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ పూర్తిగా మలినమైపోయిందని, కాబట్టి ఇప్పుడు... అసెంబ్లీ ఫ్లోర్ మొత్తాన్నీ శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమల హాసన్ అన్నాడు. ఇంకా తాను ప్రస్తుతం చాలా కోపంగా కూడా ఉన్నాడు. అంటే సాధారణ ప్రజల్లో ఆవరించిన కోపం వలె తాను కూడా కోపంగా ఉన్నాడు . ఇంతటి కోపశీలి రాజకీయాలకు పనికి రాడని ఆయన తెలిపాడు. ఇప్పుడు నిజంగా మళ్లీ ప్రజల వద్దకు ఎన్నికలు తీసుకెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈ వాతావరణం ఆ పరిస్థితిని కల్పించింది. ప్రజల వద్దకు ఈ పంచాయితీ వెళ్తేనే వారి మనసులో ఏముందో అర్థమౌతుందని కమల హాసన్ వివరించాడు.