బుల్లితెర మీద హాట్ హాట్‌గా కనిపిస్తూ.. తద్వారా వెండితెరపై అవకాశాలు సంపాదిస్తోన్న యాంకర్ అనసూయ. కాగా ఈ అమ్మడు తాజాగా మెగాహీరో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో 'సూయ.. సూయ.. అనసూయ... ' అంటూ సుమ పాడిన పాటలో చిందులేయనుంది. ఇక 'క్షణం' తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో ఆమె నాగార్జునతో కలిసి 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో చిందులేసింది. కానీ పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొంది, అద్భుత విజయం సాధించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో మొదటగా అనసూయకు ఓ ఐటం సాంగ్ ఛాన్స్ వచ్చింది.
కానీ ఆ పాటలో నర్తించడానికి ఆమె అంగీకరించలేదు. దాంతో పవన్ అభిమానులు ఆమెపై మండిపడ్డారు. దాదాపు యుద్దం ప్రకటించారు. ఆయన యాంటీ ఫ్యాన్స్ మాత్రం అనసూయ పవన్ పక్కన నటించనందని, కానీ నాగ్, సాయిలతో ఎందుకు చేస్తోందని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో కూడా విమర్శలు మొదలుపెట్టారు. కానీ ఆ చిత్రంలో పవన్ సరసన ఎందుకు నటించనని చెప్పిందో మాత్రం అనసూయ ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. తొలిసారిగా ఆమె పవన్‌తో కలిసి చిందేయలేకపోవడానికి గల కారణాన్ని వివరించింది.
ఆ చిత్రం పాటలో నటించమని తనను అడిగే సమయానికి తాను గర్భవతిగా ఉన్నానని, కాబట్టే ఆ పాటలో చేయలేకపోయానని వివరణ ఇచ్చింది. నిజమే.. కడుపులో బిడ్డను మోసే గర్భిణిగా ఉన్న సమయంలో ఓ పాటలో చిందులేయడం వీలుకాదు కదా. మొత్తానికి ఈ విషయంలో ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చినందుకు అనసూయకు, ఆమెను చీల్చిచెండాడుతున్న పవన్ ఫ్యాన్స్‌కు, దానిని అస్త్రంగా ఇంతకాలం వాడుకొంటున్న యాంటీ ఫ్యాన్స్‌కి ఇప్పటికై సరైన సమాధానం లభించిందనే చెప్పాలి.