ఒకప్పుడు మన చిత్రం ఏదైనా రిలీజ్ అయిందంటే, చివరకు లోగోలు రిలీజ్ అయిన కూడా అది ఏ హాలీవుడ్ చిత్రానికి నకలీ అనో మన విశ్లేషకులు తేల్చేసేవారు. ఇక పెరిగిన టెక్నాలజీతో చైనీస్, కొరియన్, జపనీస్ వంటి చిత్రాలను కూడా మన చిత్రాలు కాపీలుగా రూపొందుతున్నాయి. గతంలో వైవిధ్యభరితమైన కథలుగా వచ్చిన అనేక చిత్రాలను అదే కోవలోకి జమచేసేవారు. నిఖిల్ నటించిన 'కార్తికేయ, స్వామిరా...రా, సూర్య వర్సెస్ సూర్య' వంటి చిత్రాలను కూడా అలాగే పోల్చారు. అందులోనూ నిజముంది. కానీ ఇటీవల రెండు హాలీవుడ్ చిత్రాలను చూస్తే, వాటిని మన తెలుగు సినిమాల కాన్సెప్ట్‌లను, సీన్స్‌ని కాపీ కొట్టారా? అనిపించకమానదు.
ఉదాహరణగా రెండేళ్ల కిందట వచ్చిన నిఖిల్ చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' ఓ దేశ చిత్రానికి కాపీ అనిప్రచారం జరిగింది. తాజాగా విడుదలకు సిద్దమవుతున్న హాలీవుడ్ చిత్రం 'ఎవ్రీథింగ్.. ఎవ్రీథింగ్' కథను చూస్తే అది 'సూర్య వర్సెస్ సూర్య'లాగానే ఉంది. ఈ చిత్రం మే19న విడుదలకానుంది. ఇక 'స్వామి..రా..రా' చిత్రం సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఓ చిల్లర దొంగలు, విగ్రహం చోరీ వెనుక ఉన్న బ్యాక్‌డ్రాప్‌తో ఇది రూపొందింది. ఇక ఫిల్మ్‌స్మిత్ తీసిన 'ఫోకస్' చిత్రంలోని చాలా సీన్స్‌ని చూస్తే 'స్వామి..రా..రా' సినిమా గుర్తుకురాకమానదు. ఒకరికి వచ్చిన ఆలోచనే ఇతరులకు రాకూడదని ఏమీ లేదు. అలా యాథృచ్చికంగా ఇవి జరిగాయా? లేక మన చిత్రాలను హాలీవుడ్ వారు కూడా సీడీ లేసుకొని చూస్తున్నారా? అనే అనుమానం అయితే రాకమానదు.