Advertisement
Google Ads BL

'నాగ్' వల్లే అది 'చిరు'కి సాధ్యమయ్యిందా...?


మెగా స్టార్ చిరంజీవి మొహానికి మేకప్ వేసుకుని ఒకపక్క సినిమాల్లో బిజీగా మారి...  మరోవైపు బుల్లితెర మీద కూడా తన పెరఫామెన్స్ తో చంపేస్తునాడు. గత సోమవారం నుండి బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ సందడి చేస్తున్నాడు. ఇక ఈ షో ని ఇంతకుముందు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించేవాడు. అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు మూడు సీజన్స్ ని ఎంతో చాకచక్యం గా నడిపించి మూడో సీజన్ తర్వాత తప్పుకున్న నాగార్జున ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షో చెయ్యనని చెప్పడంతో ఆ షో కి హోస్ట్ గా చిరు వచ్చాడు. ఇక మూడు సీజన్స్ లో నాగార్జున గెస్ట్ లుగా సినిమా స్టార్స్ ని తీసుకొచ్చి వారిని హాట్ సీట్ లో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి షో కి పాపులారిటీ తీసుకొచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక అలాగే గెస్ట్ లుగా వచ్చిన వారిలో మెగా స్టార్ చిరు కూడా ఉన్నాడు. అయితే నాగార్జున చిరుని 150వ చిత్రం ఎప్పుడు మొదలు పెడుతున్నారు అని అడగా దానికి చిరు నవ్వుతూ మీ అందరి కోరిక మేరకు అతిత్వరలోనే నా రీఎంట్రీ ఉంటుందని చెప్పాడు. ఇక అదే సంవత్సరం ఆ సినిమా సెట్స్  మీదకెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నాగ్ అలాగే చిరు 151వ చిత్రానికి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరు చేత కమిట్ చేయించేసాడు. అసలు ఇదంతా చిరు హోస్ట్.. నాగ్ గెస్ట్  గా వున్నప్పుడు జరిగింది. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కి గెస్ట్ లు ఆహ్వానించేపనిలో నాగార్జునని ప్రగ్య జైస్వాల్ ని ఆహ్వానించాడు. ఇక హాట్  సీట్ లో కూర్చున్న నాగ్, చిరు అడిగిన వాటికీ సమాధానం చెబుతూనే 151వ చిత్రం ఎప్పుడు ఉంటుంది... ఎవరితో చేస్తున్నారు అని అడగా... దానికి చిరు నవ్వుతూ 151వ చిత్రం అతిత్వరలో మొదలవ్వబోతుందని అదీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్క్కిస్తాడని చెప్పాడు. 

ఇక దర్శకుడు గురించి ఆఫిసిఅల్ గా చేప్పేసినా చిరు.... మిగతా వివరాలు మాత్రం చెప్పలేదు. ఇక ఈ జర్నీ ని ఇలాగే కొనసాగిస్తానని... సినిమాలు  చేస్తానని మాత్రం చెప్పాడు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు షో చెయ్యడం తనకి ఒక కొత్త అనుభూతినిచ్చిందని చెప్పాడు చిరు. అయితే నాగార్జున మాత్రం 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150  సక్సెస్ అయినట్లే... 151వ చిత్రం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs