Advertisement
Google Ads BL

పవన్‌ మాదిరే నాగ్‌ హల్‌చల్‌ చేయనున్నాడు..!


'ఓం నమో వేంకటేశాయ' తర్వాత నాగార్జున ఓంకార్‌ దర్శకత్వంలో తొలిసారిగా ఓ హర్రర్‌ కామెడీ థ్రిల్లర్‌గా 'రాజు గారి గది2' చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. కాగా ఈ చిత్రంలో నాగార్జునతో పాటు సమంత కూడా ఓ కీలకపాత్రను చేయనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున ఓ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు. అతీంద్రీయశక్తులు కలిగి, ఇతరుల మనస్తత్వాలు, ఆలోచనలు తెలుసుకొని, వారిని ఓ ఆటాడించే పాత్రను నాగ్‌ చేయనున్నాడట.

Advertisement
CJ Advs

అలాగే 'గోపాల గోపాలా' చిత్రంలో పవన్‌ మాదిరిగా ఓ ఫ్యాన్సీ బైక్‌పై హల్‌చల్‌ చేస్తూ నవ్వులు పంచనున్నాడట. ఇక ఇందులో నాగ్‌ నడక నుంచి హెయిర్‌స్టెయిల్‌, డ్రెసింగ్‌, లుక్‌ వరకు అన్నీ ట్రెండీగా, అద్బుతంగా ఉండనున్నాయని సమాచారం. 'రాజుగారి గది' చిత్రానికి దర్శకత్వం వహించిన ఓంకారే ఈ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నాడు. ఇక పివిపి సంస్థతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైనర్స్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తుండగా, మొదటి భాగంలో కీలకపాత్రను చేసిన ఓంకార్‌ సోదరుడు అశ్విన్‌, సీరత్‌కపూర్‌లు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందించనున్నాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs