Advertisement
Google Ads BL

పాపం... చిన్నమ్మకు ఏమైంది....?


తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వమ్ మధ్యన గత ఆరు రోజులుగా జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పటికి కొనసాగుతూనే వుంది. శశికళకు కోర్టు కేసు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళకు, శశికళ వదిన కు, ఆమె అక్క కొడుకుకి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇక జయలలిత మరణంతో ఆమె ఈ శిక్షనుండి తప్పించుకుంది. ఇక మిగిలింది జయ నెచ్చెలి శశి ఖచ్చితంగా జైలుకెళ్లాల్సిన పరిస్థితి. ఇంకేముంది శశికళ కు జైలు కూడు తప్పేలా లేదు. అందుకే శశికళ వెంటనే మేలుకుని సీఎం అభ్యర్థిగా పళని స్వామిని సెలెక్ట్ చేసేసింది. పన్నీర్ సెల్వానికి మళ్లీ చెక్ పెట్టింది. ఇక ఆమె గోల్డెన్ బె రిసార్ట్స్ లోనే ఉండి నిన్న రాజకీయ మీటింగుతో... ఆమె జైలు కెల్లకుండా తప్పించుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తూ రాత్రికి రాత్రి మళ్లీ పోయెస్ గార్డెన్ కి వెళ్ళిపోయింది. సుప్రీం కోర్టు కి తన ఆరోగ్య రీత్యా లొంగి పోవడానికి నాలుగు వరాల గడువు కోరింది. అయినా ఆమె అత్యాశ కాకపోతే ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న కేసు ఇప్పుడు ఫైనల్ హియరింగ్ కి వచ్చి శిక్ష విధించిన తర్వాత ఆమె ఎన్ని సాకులు చెప్పినా కోర్టు ఊరుకోదు కదా.... అందుకే ఆమె పిటిషన్ ని తిరస్కరించి లొంగిపోతారా... ? లేక అరెస్ట్ చెయ్యమంటారా? అంటూ గద్దించింది.

Advertisement
CJ Advs

అయినా రాజకీయాలు చెయ్యడానికి ఉన్న ఆరోగ్యం.. జైలు కెళ్లడానికి లేదంట. మరీ విడ్డురం కాకపోతే కోర్టు కళ్ళు మూసుకుందని ఏ ఆట ఆడితే ఆ ఆట సాగుతుందా.... అందుకే కోర్టు బాగా మొట్టికాయలు వేసింది. ఇక చేసేది లేక శశికళ పోయెస్ గార్డెన్ లో ఉండి జయలలిత పార్టీ నుండి బహిష్కరించి దినకర్ కి మళ్లీ పార్టీ ఉప కార్యదర్శి పదవి కట్టబెట్టి తన చేతికింద పెట్టుకుంది. మరి శశికళ అమ్మ ఆశయాలకు ఇలా తూట్లు పొడుస్తూ ఉంటె చేతకాని కార్యకర్తలు మాత్రం శశికి చిన్నమ్మా.. అంటూ జైకొడుతున్నారు. మరోపక్క పోయెస్ గార్డెన్ నుండి జయ సమాధి వద్దకి వచ్చి  పిచ్చిపట్టినట్లు శశికళ జయ సమాధిపై మూడుసార్లు గట్టిగా చరిచి శపథం లాంటిది  ఒకటి చేసింది. నేను నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవించి వచ్చి మళ్లీ పార్టీని పటిష్టపరుస్తానని శపథం చేసింది. 

అయితే శశికళ అమ్మ సమాధిపై అలా గట్టిగా కొట్టడం చూసిన కొంతమంది మాత్రం అమ్మపై కోపంగా నీవల్లనే నేను జైలుకెళ్ళాసొచ్చిందనే కోపంతో చిన్నమ్మ ఇలా ప్రవర్తిస్తుందని కామెంట్స్ చేసున్నారు. ఇక సమాధి దగ్గర నుండి శశికళ రోడ్ మార్గం ద్వారా బెంగుళూరు వెళ్లి ప్రత్యేక కోర్టులో లొంగిపోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా గవర్నర్ విద్యాసాగర్ రావు ఎవరికి అవకాశం ఇస్తారా... అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇదంతా ఇలా ఉంటే పన్నీర్ సెల్వం జయ మేనకోడలితో కలిసి రాజకీయ చదరంగం మొదలు పెట్టాడు. ఆయన దీపతో కలిసి నిన్న రాత్రి జయ సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించారు. మరి ఇంత రసవత్తర పొలిటికల్ గేమ్ మధ్యన  తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో... అనేది ఈ రోజు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs