Advertisement
Google Ads BL

యోగా టీచర్‌ ది కాన్ఫిడెన్సా..? ఓవర్‌కాన్ఫిడెన్సా?


హీరోయిన్‌ అనుష్క రేంజ్‌ 'అరుంధతి' చిత్రంతో మారిపోయింది. ఆమె స్టార్‌ హీరోయిన్‌గా , లేడీ ఓరియంటెడ్‌, భారీ బడ్జెట్‌ చిత్రాల హీరోయిన్‌గా మారింది. దాంతో ఆమెను వెత్తుకుంటూ ఎన్నో అవకాశాలు వచ్చాయి. మరోవైపు 'మిర్చి' చిత్రంలో ప్రభాస్‌ సరసన సెక్సీగా కనిపిస్తూ, తన ఒంపుసొంపులతో అలరించింది. దీంతో ఈ యోగా టీచర్‌ ఈ వయసులో కూడా తన హవా చాటుతోందని, ఇప్పటికీ ఫిజిక్‌ను పర్‌ఫెక్ట్‌గా మెయిన్‌టెయిన్‌ చేస్తోందనే ప్రశంసల వర్షం కురిసింది. ఆమె యోగా పట్ల, ఆమె డెడికేషన్‌తో ఈ వయసులో కూడా అంత అందంగా కనిపిస్తూ ఉండటంతో అందరూ ఆమెను ఏంజెల్‌తో పోల్చారు. ప్రతి హీరోయిన్‌ తన కెరీర్‌లో ఓ 'బరువైన' పాత్రను చేయాలని, నటనకు స్కోప్‌ ఉండి భిన్నఎమోషన్స్‌ ఉండే బరువైన పాత్రల్లో నటించాలని కలలు కంటూ ఉంటారు. 

Advertisement
CJ Advs

స్వీటీ కూడా అదే పని చేసింది. అయితే పాత్రలోని నటన 'బరువు'ను పక్కనపెడితే ఆమే ఏకంగా బరువు విపరీతంగా పెరిగి 'సైజ్‌ జీరో' కోసం పెద్ద సాహసమే చేసింది. ఈ చిత్రం సమయంలోనే ఆమె 'ఎస్‌3, బాహుబలి' వంటి చిత్రాలకు సైన్‌ చేసింది. ఎంతలావు పెరిగినా తన యోగా టెక్నిక్‌తో మరలా సన్నగా మారగలనని ఆమె ఓవర్‌కాన్ఫిడెన్స్‌తోనే ఈ పని చేసిందనే విమర్శలున్నాయి. ఇక ఈ చిత్రం ద్వారా ఆమె బరువైన , కాస్ట్‌లీ మిస్టేక్‌నే చేసింది. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. తాజాగా విడుదలైన 'ఎస్‌3, ఓం నమో వేంకటేశాయ' చిత్రాలలో ఆమె మరీ లావుగా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఇబ్బందిపెట్టి ఆ చిత్రాలకు మెయిన్‌ మైనస్‌ పాయింట్‌గా మారింది. ఆమె 'సైజ్‌జీరో' తర్వాత అసలు పాత షేప్‌కి రాలేదని మీడియాలో బాగా వార్తలు వచ్చాయి. 

దీనిపై ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు, అనుష్క వంటి వారు ఫైర్‌ అయ్యారు. తాజాగా ఇటీవల విడుదలైన 'బాహుబలి2' పోస్టర్‌లో ఆమె బాహుబలిగా నటిస్తున్న ప్రభాస్‌తో కలిసి దేవసేనగా విల్లంబులు చేతబట్టి నాజూకుగా కనిపించింది. కానీ ఈ విషయంలో రాజమౌళి ఆమెను సన్నగా చూపించేందుకు గ్రాఫిక్స్‌ నిపుణుల సహాయం తీసుకుంటున్నాడని, అంతకు ముందే ఆమె లావు తగ్గకపోవడంతో రాజమౌళి అనుష్క మీద ఫైర్‌ అయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈవిషయంలో కూడా పలువురు ఇవి కేవలం గాలివార్తలేనని మీడియాపై అరిచారు. ఇటీవల విడుదలైన రెండు చిత్రాలలో, అలాగే కాంచీ దర్శకత్వంలో రూపొందుతున్న 'షోటైం' వేడుకలో కూడా ఆమె చిన్నసైజ్‌ బియ్యపు బస్తాగానే కనిపించడంతో అది నిజమేనని తేలింది. దీంతో ఈమెను తన 151వ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలని భావించిన చిరంజీవి, మెగా క్యాంపు సైతం ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారట. అనుష్క అన్ని చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేసింది. 'పిల్లజమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భాగమతి' షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. కొత్తగా ఆమె ఏ చిత్రాన్ని కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి ఇది అనుష్క కెరీర్‌కు గడ్డురోజులని, ఇక ఆమె పెళ్లి చేసుకోవడం మేలనే విమర్శలు వస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs