విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళంలో ఒక వెలుగువెలుగుతుంది. ఒకప్పుడు తెలుగులో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శృతి పవన్ పక్కన గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా గోల్డెన్ హీరోయిన్ అయిపొయింది. ఇక వరసగా స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయ్యింది. మరోపక్క తమిళంలో కూడా తన హవా కొనసాగిస్తుంది.శృతి హస్సన్ తాజాగా తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన 'కాటమరాయుడు'లో...... తండ్రి చిత్రం శభాష్ నాయుడులో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఇప్పుడు శృతికి బిగ్ ఆఫర్ ఒకటి ఆమె తలుపు తట్టిందని అంటున్నారు.
ఇక వచ్చిన అవకాశాన్ని శృతి ఎగిరి గంతేసిమరీ ఒప్పుకుందట. అయితే ఆ ప్రాజెక్ట్ అలాంటి ఇలాంటిది కాదంట. టాప్ డైరెక్టర్ సుందర్ సి 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ భారీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ కి హీరోయిన్ గా ఆఫర్ రావడమూ.... దానికి శృతి ఒప్పుకోవడము జరిగిపోయాయట. ఇప్పటికే టైటిల్ కూడా రిజిస్టర్ చెయ్యబడ్డ ఈ చిత్రంలో హీరోలుగా జయం రవి, ఆర్యలు నటిస్తున్నారని సమాచారం. సుందర్ సి తియ్యబోయే ఆ భారీ బడ్జెట్ చిత్ర టైటిల్ ఏమిటో అనుకుంటున్నారా... అదేనండి 'సంఘమిత్ర'. మరి టైటిల్, హీరోయిన్, హీరోల ఎంపిక కూడా జరిగిన ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది.