వాస్తవానికి బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల కన్నా తెలుగు, తమిళ ప్రజలు సెంటిమెంట్ ఫూల్స్. వారు సామాన్యంగా అభిమానించరు. అభిమానించడం మొదలుపెడితే జీవితాంతం ఆదరిస్తూనే ఉంటారు. ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు.. అనేది వాస్తవం. ఇదే డైలాగ్‌ను చిరంజీవి సైతం ఓ సినిమాలో చెప్పాడు. కాగా అదే డైలాగ్‌ను ఆయన తాజాగా కూడా వినిపించారు. తాజాగా జరిగిన 'స్టార్ మా' లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత సినిమాలలోకి వస్తున్నాను. మరి మునుపటి స్థాయిలో ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా? లేదా? అనే సంశయం నాకు కూడా వచ్చింది అని చిరు ఒప్పుకోవడం గ్రేట్. కానీ 'ఖైదీనెంబర్150'కి వచ్చిన ఆదరణ చూస్తే తెలుగువారు సెంటిమెంటల్ ఫూల్స్ అని నేను ఏదో చిత్రంలో ఈ డైలాగ్‌ను చెప్పాను.
అది నిజం అన్నాడు. కానీ చిరుకి ఆ డైలాగ్ ఉన్న చిత్రం గుర్తుకురాలేదు. కానీ ఆయన అభిమానులు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆ డైలాగ్ ఏ చిత్రం లోనిదో ఠక్కునచెబుతారు. ఇక విషయనికి వస్తే తెలుగు ప్రేక్షకులు, తమిళ ప్రేక్షకులు సెంటిమెంటల్ ఫూల్సే అయినప్పటికీ ఎవరికి ఎప్పుడు మద్దతివ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి అనుమానం వస్తే ఏమవుతుంది? సినిమాలకు రాజకీయాలకు ఉన్న తేడా ఏమిటి? అనేది బాగా తెలుసు, వారు గుడ్డిగా అన్నింటినీ నమ్మరు. దానికి రాజకీయంగా చిరు ప్రస్ధానం, ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే స్థాయి, శక్తి, కేంద్రంలోని బిజెపి అండదండులు ఉన్నా కూడా రజనీ మౌనం వహించడానికి అదే కారణం. ఇక అన్నాడీఎంకే అధినేత్రి, స్వర్గీయ జయలలిత అండదండలు ఉన్నప్పటికీ తలా అజిత్ రాజకీయాల విషయంలో మౌనం పాటిస్తుండటానికి అసలు లోగుట్టు. వారు సెంటిమెంటల్ ఫూల్స్ అయినా కూడా విచక్షణ కలిగి ఉండటమే కారణం అని చెప్పవచ్చు.