Advertisement
Google Ads BL

అన్నయ్యకు... తమ్ముడు సలహా ఇస్తున్నాడా..?


నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా 'జై లవ కుశ' (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని బాబీ డైరెక్షన్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' హిట్ చిత్రం తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఈ చిత్రాన్ని భారీ లెవల్లో నిర్మించాలని కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడట. బడ్జెట్ కి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడట కళ్యాణ్ రామ్. అందుకనే బాలీవుడ్, హాలీవుడ్ సాంకేతిక నిపుణులను ఈ చిత్రం కోసం రప్పిస్తున్నాడట. ఎలాగూ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించడంతో ఎందులోనూ రాజి పడకుండా  ఈ చిత్రాన్నితెరకెక్కించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రానికి 45  కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దని అన్నయ్య కళ్యాణ్ రామ్ కి చెప్పాడట. కానీ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సలహాని పాటించకుండా ఈ చిత్రాన్ని కి 65  కోట్ల కి పైగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడట. కేవలం నాణ్యతా పరమైన విషయాల కోసమే ఆ మాత్రం బడ్జెట్‌ను పెట్టాల్సి వస్తుందని ఎన్టీఆర్ కి కల్యాణ్‌రామ్ వివరించాడట.

Advertisement
CJ Advs

మరి కళ్యాణ్ రామ్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎన్టీఆర్ మూడు పాత్రలకి ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని తీసుకురావాలన్నా, టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయాలన్నా, మంచి విలువలున్న చిత్రాన్ని తెరకెక్కించాలన్నా ఆ మాత్రం బడ్జెట్ అవసరమే. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం అన్నయ్యకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా అలా తక్కువ బడ్జెట్ పెట్టమని సలహా ఇచ్చిండోచ్చు. ఏది ఏమైనా ఇలా అన్నదమ్ములు ఒకరికి ఒకరు కష్ట సుఖాలు పంచుకోవడం మాత్రం చూసేవారికి కన్నుల పండుగా గా వుంది అనేది నిజం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs