Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్..!


ఎన్టీఆర్ ఎట్టకేలకు తన 27వ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసేశాడు. ఎన్టీఆర్  తండ్రి హరికృష్ణ,  కొడుకు అభయ్ రామ్, భార్య లక్ష్మి ప్రణతిలు ఈ పూజ కార్యక్రమంలో సందడి చేశారు. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ తన 27వ చిత్రం 'జై లవ కుశ' (వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిబుల్ రోల్ చేయనున్నాడని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఎన్టీఆర్ చిత్రానికి ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక కావాల్సి వుంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఒక హీరోయిన్ రాశి ఖన్నాని ఫైనల్ చేయగా మిగిలిన ఇద్దరు హీరోయిన్స్ ని ఇంకా ఎంపిక చెయ్యాలి. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నివేత థామస్ ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరిగినా ఆమె ఎంపికని ఇంకా ధ్రువీకరించలేదు. అయితే ఇప్పుడు మరో వార్త ఎన్టీఆర్ 27వ చిత్రం పై సోషల్ మీడియాలొ కథనాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ సరసన మరో ఇద్దరు హీరోయిన్స్ ని కూడా నిర్మాత కళ్యాణ్ రామ్ ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. వారు ఎన్టీఆర్ తో 'ఊసరవెల్లి' లో నటించిన తమన్నా, మరొకరు 'బాద్షా'లో ఎన్టీఆర్ కి జోడిగా నటించి, 'జనతా గ్యారేజ్' చిత్రంలో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన కాజల్ అగర్వాల్ లు ఎన్టీఆర్ సరసన ఎంపికైనట్లు వార్తలైతే ఊపందుకున్నాయి. 

అయితే వీరిలో రాశి ఖన్నా, తమన్నా లు ఇద్దరూ కలిసి రవితేజ 'బెంగాల్ టైగర్' లో ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన రాశి ఖన్నా, కాజల్, తమన్నా లు నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమనే కామెంట్స్ వినబడుతున్నాయి. నిజంగా కాజల్, తమన్నా, రాశి ఖన్నా లు ఒకే చిత్రంలో కనబడితే చూసేవారికి మాత్రం రెండు కళ్ళు చాలవు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs