Advertisement
Google Ads BL

మెగామేనల్లుడు ఆలస్యానికి కారణం ఇదే...!


మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా, అనసూయ స్పెషల్‌ ఐటంలో చేస్తున్న చిత్రం 'విన్నర్‌'. కాగా ఈ చిత్రం టీజర్‌ బాగా ఆకట్టుకుంది. ఇక విడుదలవుతున్న ఒక్కో పాటకి తమన్‌ మంచి సంగీతం అందించాడనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేయాలని దర్శకుడు గోపీచంద్‌ మలినేని, నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధులు భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ కూడా ఇప్పటికే విడుదల కావాల్సివుంది. కానీ ఈ ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది. దాంతో అందరిలో ఈ చిత్రం రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ పడుతుందేమోనన్న అనుమానాలు ఏర్పడ్డాయి.

Advertisement
CJ Advs

కానీ సినిమా యూనిట్‌ మాత్రం కేవలం కొన్నిసాంకేతిక పరమైన కారణాల వల్ల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయలేకపోయామని సర్దిచెబుతున్నారు. 'విన్నర్‌'లో హీరో హార్స్‌రైడర్‌గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఈ చిత్రంలో గుర్రపుస్వారీకి సంబంధించిన పలు సీన్లను షూట్‌ చేశారు. మన దేశంలోని కొన్ని నియమనిబంధనల ప్రకారం ఇలాంటి జంతువులను చూపించినప్పుడు యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ నుండి అనుమతి పత్రం తీసుకొని రావాలి. లేకపోతే ఆ సినిమా ప్రదర్శనను కూడా ఆపివేసే హక్కు బోర్డ్‌లకు ఉంటుంది. ఈ నిబంధనలు సినిమాకేకాదు... ట్రైలర్స్‌కి కూడా వర్తిస్తాయి. దీని కోసం నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఓసీ)కు ఈ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ పత్రం లభించడంలో ఆలస్యమైంది. ఆ సర్టిఫికేట్‌ తెచ్చుకున్న వెంటనే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తారు. ప్రస్తుతం యూనిట్‌ దీని కోసం ఎదురుచూస్తున్నారు.ఈ సర్టిఫికేట్‌ లభించిన వెంటనే ట్రైలర్‌ని విడుదల చేసి, సెన్సార్‌ కూడా జరిపి, అనుకున్న సమయానికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు పట్టుదలగా ఉన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs