Advertisement
Google Ads BL

పబ్లిసిటీ కోసమేనా ఈయన గారు అన్నది..!


కొన్ని రోజుల ముందు పవన్ కళ్యానికి చిరంజీవి కి మధ్యన చాలా విభేదాలున్నాయని తెగ ప్రచారం జరిగింది. అయితే అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఫోన్ చేసుంటున్న విషయం, వారు కలుస్తున్న విషయం తెలిసీ తెలియకపోయినా  మీడియా మాత్రం మెగా ఫ్యామిలిలో చీలికలొచ్చాయనే ప్రచారం చేస్తూ వచ్చింది. ఒక్క మీడియానే తప్పుపట్టకూడదు ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కూడా పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కింద సపరేట్ అయిపోయారు. ఇక ఇవన్నీ చూస్తుంటే వారి మధ్యన ఏదో? ఉందని ప్రతి ఒక్కరికి అర్ధమైపోతుంది. అసలు వాళ్ళు కలవకపోయినా న్యూసే.... కలిసిన సెన్సేషనే అలా తయారయ్యింది మెగా ఫ్యామిలీ కుటుంబం గురించి. 

Advertisement
CJ Advs

అయితే వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ పబ్లిసిటీ అంటే పడిచచ్చే సుబ్బరామిరెడ్డి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలయికలో మల్టి స్టారర్ చిత్రం నిర్మిస్తున్నాని అందరికి షాక్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్, నేను కలిసి నిర్మిస్తున్నామని ప్రకటించి ఆశ్చర్య పరిచాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడని చెప్పాడు. మరి సుబ్బరామిరెడ్డి అసలు చిరు తోగాని పవన్ తో గాని ఈ మెగా మల్టిస్టారర్ గురించి చర్చించి ఈ ప్రకటన చేశాడా? అసలు త్రివిక్రమ్ ని అయినా సంప్రదించాడా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాలేదు. 

ఇక ఈ మెగా మల్టి స్టారర్ గురించి ఇప్పటిదాకా చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని ఎక్కడా నోరు మెదపలేదు. మరోపక్క త్రివిక్రమ్ కూడా ఈ మల్టీస్టారర్ గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు. మరో నిర్మాత అశ్విని దత్ కూడా ఈ విషయమై ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. మరి అసలు సుబ్బరామిరెడ్డి ఈ ప్రకటన ఎలా చేసాడు. ఏదో తనకి అనిపించింది చెప్పి కామ్ అయిపోయాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేవలం మీడియాలో తన పేరు హైలెట్ కావడానికే ఈ మెగా మల్టి స్టారర్ చిత్రాన్ని సుబ్బరామిరెడ్డి ఎనౌన్స్ చేసాడని అప్పుడే ప్రచారం మొదలయ్యింది. ఇలాప్రచారం జరుగుతుందో లేదో అప్పుడే మెగా ఫ్యాన్స్ బాధపడిపోతున్నారట. పాపం తమ అభిమాన హీరోలు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్నా వారికీ ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం లేదనే వార్త కాస్త బాధ కలిగించే విషయమే. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs