Advertisement
Google Ads BL

కామెడీ జోనర్ చిత్రాలకు ఆదరణ లేదా..?


ఒకప్పుడు కేవలం కామెడీనే ప్రధానాంశంగా తీసుకొని వచ్చిన పలు చిత్రాలు పెద్ద పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇలా ఫుల్‌లెంగ్త్‌ కామెడీలు ఒక్క తెలుగులోనే ఎక్కువగా వచ్చి విజయం సాధించాయంటే వాటి స్టామినా అర్ధమవుతుంది. రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌, సీనియర్‌ నరేష్‌ వంటి వారు ఈ చిత్రాల ద్వారా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత కొంతకాలం అల్లరినరేష్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసినట్లే కనిపించాడు. కానీ రాను రాను విభిన్న కామెడీ కథాంశాల కొరత కారణంగా ఇలాంటి చిత్రాలకు పెద్ద ఎదురుదెబ్బే తగులుతోంది. 

Advertisement
CJ Advs

రొటీన్‌ కామెడీని ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో 'జబర్దస్త్‌' తోపాటు ఈటీవీ ప్లస్‌లో ప్రసారమవుతున్న 'హంగామా' నుండి అనేక కార్యక్రమాలు నట్టింట్లోనే తిష్ట వేస్తూ.. కామెడీని అందిస్తున్నాయి. సో.. ఇప్పుడు వందలు ఖర్చుపెట్టి కామెడీ చిత్రాలను చూసే హాస్యప్రియుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఇటీవల చాలాకాలం హిట్‌ చిత్రాలకు, డైలాగ్స్‌కు స్పూఫ్‌ల హవా కూడా బాగానే కొనసాగింది. అలా చేసిన అల్లరినరేష్‌ 'సుడిగాడు' చిత్రం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత బర్నింగ్‌స్టార్‌గా వచ్చిన సంపూ నటించిన 'సింగం123' చిత్రం కూడా ఓ హిట్‌నే ఇచ్చింది. దీంతో మరలా వాటికి రెక్కలు వచ్చాయి. కానీ కథే లేకుండా కేవలం పేరడీలతో చిత్రాలు తీస్తే ఎల్లకాలం ఆడవని అల్లరి నరేష్‌ నటించిన 'సెల్ఫీరాజా'తో అందరికీ అర్ధమైంది. 

ఒకప్పుడు మహిళలను ఆకట్టుకునేందుకు పూర్తిగా సెంటిమెంట్‌తో వచ్చిన విజయాలు మంచి విజయం సాధించాయి. కానీ అవి కూడా నేడు బుల్లితెర సీరియల్స్‌లో బాగా కనిపిస్తుండే సరికి మహిళలు ఎంతో పెద్ద టాక్‌ వస్తేగానీ థియేటర్‌కు రావడం లేదు. ఇలా సెంటిమెంట్‌ చిత్రాల హవా కూడా బాగా తగ్గింది. ప్రేక్షకులు ఇప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రతి చిత్రంలో కోరుకుంటున్నారు. కానీ కేవలం కామెడీ కోసం సపరేట్‌ ట్రాక్‌లను సృష్టిస్తుంటే మాత్రం ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఇలా చేసిన 'శిరిడీ సాయి, ఎస్‌3' లతో పాటు నిన్న విడుదలైన మంచి విజయం దిశగా సాగిపోతోన్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలోని అనవసరపు కామెడీ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs