Advertisement
Google Ads BL

వర్మ మాటతప్పుతున్నాడా? లేక మారుతున్నాడా?


వర్మ మాట మీద ఎప్పుడు నిలబడడు. ఆయన్ను ఆ ప్రశ్న వేస్తే నేను ఎప్పుడు ఏది తోస్తే అది చెప్తాను.. నాకు మాటపై నిలబడడం చేతకాదని ఎన్నోసార్లు సెలవిచ్చాడు. ఇక ఆ మధ్య వరుస చెత్త సినిమాలు తీస్తున్న సందర్భంగా 'వంగవీటి' ఫంక్షన్‌లో ఇక నుంచి తన నుంచి మంచి చిత్రాలు వస్తాయని మాటిచ్చాడు. సాధారణంగా అంతా నా ఇష్టం.. నచ్చితే చూడండి.. నచ్చకపోతే మానేయండి అని చెప్పే ఆయన ఆ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 

Advertisement
CJ Advs

గతంలో తనకు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అనే ప్రత్యేకత ఏమీ ఉండవని, ఆలా వేడుకలు చేసుకోవడం తనకిష్టం లేదని తెలిపాడు. అలాంటివంటే తనకు మహా చిరాకని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఇప్పుడు మరో విషయంలో కూడా మారాడా? అనిపిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌7న తాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో రీఎంట్రీ ఇస్తోన్న 'సర్కార్‌3'ని విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా మారిన మనిషేనని, కొత్త పద్దతులు అలవాటు చేసుకుంటున్నాడని, కానీ ఏ నిమిషంలోనైనా ఆయన మాట మార్చి, మరలా అంతా నా ఇష్టం అనే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 

తనకు అచ్చివచ్చిన మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఈ 'సర్కార్‌3'పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. త్వరలో టీజర్‌, ట్రైలర్స్‌ని కూడా రిలీజ్‌ చేసి తన బర్త్‌డే  సందర్బంగా ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తోంది. తన 28ఏళ్ల కెరీర్‌లో వర్మ తొలిసారి ఈ పని చేస్తున్నాడు. మరి అమితాబ్‌... వర్మకు తొలిసారిగా మంచి బర్త్‌డే గిఫ్ట్‌ను భారీ విజయం ద్వారా బిగ్‌ బి అందిస్తాడా? లేదా ? అన్నది వేచిచూడాల్సివుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs