మంచి ఫామ్ లో ఉండగానే సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక చాలా సంవత్సరాలు కుటుంబ బాధ్యతల కారణంగా వెండితెరకి దూరమయ్యింది. ఇద్దరి పిల్లలకి తల్లి అయిన జ్యోతిక మళ్లీ మెల్లగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో స్టార్స్ పక్కన నటిస్తూ మళ్లీ బిజీ అయిన జ్యోతిక హీరో విజయ్ చిత్రంలో ఒక మంచి ఛాన్స్ కొట్టేసింది. ఇక జ్యోతిక రీఎంట్రీ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటుందని అనుకున్నారు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకి ఎంపికైన జ్యోతిక క్యారెక్టర్ ఈ చిత్రంలో కొంచెం కృషియల్ గా ఉంటుందట. ఇక అన్ని సజావుగా జరుగుతున్న సమయంలో జ్యోతిక ఇప్పుడు ఆ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
డేట్స్ అడ్జెస్ట్ చేయలేక జ్యోతిక విజయ్ చిత్రంలో ఛాన్స్ మిస్ చేసుకుందని అంటున్నారు. ఇక జ్యోతిక హ్యాండ్ ఇచ్చాక ఎవరైతే ఆ పాత్రకి బావుంటుందో అని చిత్ర యూనిట్ తీవ్ర ఆలోచనలో పడిందట. ఇక ఆ వేటలో ఆ పాత్రకి ఆసిన్ అయితే బావుంటుందనిపించి ఆమెని అప్రోచ్ అవ్వగా ఆసిన్ తాను పెళ్లి తర్వాత సినిమాలు చెయ్యడం లేదని చెప్పిందట. ఇక ఆసిన్ చెయ్యననేసరికి ఇక ఫైనల్ గా నిత్యా మీనన్ ని అడగగా ఆమె ఒకే చేసిందని అంటున్నారు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరైన నిత్యా, అట్లీ మూవీలో ఆ పాత్రలో అదరగోడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే విజయ్ కి జోడిగా సమంత, కాజల్ లు హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. ఇక నిత్య మీనన్ ని ఒక కీలక పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.