టాలీవుడ్ లో స్వచ్చమైన తెలుగు ముద్దుగుమ్మగా పేరుగాంచిన అంజలి, కోలీవుడ్ యంగ్ హీరో జై లు చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్ది ఎఫైర్ కు సంబంధించిన చాలా కాలంగా కోలీవుడ్ లో మీడియా కోడై కూసినా అభిమానులు అంతగా పట్టించుకోలేదు. చాలా సార్లు వీరిద్దరూ షికార్లు చేస్తూ మీడియాకు దొరికిపోయినా ఆ విషయాన్ని ప్రముఖంగా మీడియాలో ఎపిసోడ్లు, ఎపిసోడ్లు చూయించినా గానీ ఆ జంట మాత్రం ఏమాత్రం నోరు మెదపలేదు. మొత్తానికి ఇన్నాళ్ళు అణచుకొని అణచుకొని నాన్చిన వీరిద్దరి ప్రేమాయణం వీరంతట వీరే ప్రతి వాడు మదిలో అర్ధం చేసుకొనేలా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి ఒక దోసె వీరిద్దరి ప్రేమాయణాన్ని కన్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదనుకో. కోలీవుడ్ హీరో సూర్య విసిరిన దోసె ఛాలెంజ్‌ను తీసుకొని దాన్ని అంజలితో కలిసి చేసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు జై. ఆ రకంగా వీరి మధ్య ప్రేమాయణం బాగానే నలుగుతున్నట్లు అందరికీ తెలిసినట్లయింది. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు కూడా కోలీవుడ్‌లో ముమ్మరంగా ప్రచారం సాగుతుంది. అయితే ప్రధాన పాత్రలో జ్యోతిక నటించిన ‘మగళిర్ ముట్టమ్’ మూవీ టీజర్ రీసెంట్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఇంట్లో అందరి కోసం లెక్కకు మించి దోసెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె అయినా వేశారా? అనే ఒక డైలాగ్ ఉంది. అప్పుడు సూర్య, జ్యోతిక కోసం ఒక దోసె వేసి అందరికీ ఛాలెంజ్ విసురుతాడు. అలాగే ఇప్పుడు హీరో జై కూడా ఒక దోసెను వేసి, ఆ దోసెను అంజలికి ఇస్తున్న ఓ ఫోటోను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన లవ్ ను కన్ఫామ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది.