Advertisement
Google Ads BL

ఖండించండి.. కానీ బెదిరించకండి!


ఈ మధ్య రాజకీయనాయకులే కాదు.. సినిమా వారిలో కూడా అసహనం పెరిగిపోతోంది. చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోతున్నారు. అలా వారు నానా దుర్భాషలాడుతూ, భౌతిక దాడులకు కూడా సిద్దపడుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్‌ నాగార్జునల నుంచి పవన్‌స్టార్‌, యంగ్‌టైగర్‌, స్టైలిష్‌స్టార్‌, ప్రిన్స్‌ నుంచి సూపర్‌స్టార్‌గా మారిన వారు, యంగ్‌ రెబెల్‌స్టార్‌, మాస్‌ మహారాజాల వరకు అందరూ ఇదే కోవకి చెందిన వారే. గతంలో చిరు, బాలయ్య, పవన్‌, జూనియర్‌, నాగ్‌.. ఇలా అందరూ మీడియాపై మండిపడి నానాబూతులు మాట్లాడిన వారే. ఇక మంచు ఫ్యామిలీ గురించి, మోహన్‌బాబు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక దాసరితో పాటు పలువురు మీడియా యాంటీగా ఒక్క ప్రశ్న వేసినా తట్టుకోలేరు. గతంలో నాగ్‌ విగ్గు వాడుతున్న ఫొటోతో పాటు న్యూస్‌ను కూడా వేసిన ఓ మహిళా జర్నలిస్ట్‌పై నాగ్‌ బూతులు తిట్టి, భౌతిక దాడి చేయబోయాడు. మోహన్‌బాబు ఎందరినో కొట్టిన సందర్భాలున్నాయి. పవన్‌.. ఉదయ్‌కిరణ్‌తో చిరు కూతురి నిశ్చితార్దం సందర్భంగా ఓ వీడియో గ్రాఫర్‌ను నిలువునా కొట్టాడు. బాలయ్య ఓ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సందర్భంగా మీడియా హడావుడి చూసి..లం.. అంటూ బూతుల దండకం మొదలెట్టాడు. దాసరి, చిరంజీవులు తమ ఇంటర్వ్యూ కావాలంటే వారికి పాద నమస్కారాలు చేయాల్సిందే. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్‌ 'ఆది'తో బ్రేక్‌ వచ్చి 'సింహాద్రి'తో తన రేంజ్‌ మారిపోయి స్టార్‌ అయిన తర్వాత తనను జూనియర్‌ అని పిలవడానికి వీలులేదని హుకుం జారీ చేశాడు. ఆయన్ను..మీ తాతగారు.. మహానుభావుడు.. ఆయన్ను ఎన్టీఆర్‌ అని సంబోధించి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మిమ్మల్ని కూడా ఎన్టీఆర్‌ అనే పిలిస్తే ప్రేక్షకులకు కూడా కన్‌ఫ్యూజన్‌ వస్తుంది. అలాగే అలాంటి మహానుభాహుడిని పిలిచిన పేరుతో ఇప్పుడే మిమ్మల్ని కూడా పిలవడం ఎంత వరకు సమంజసం? అని ఓ పత్రికా ఇంటర్వ్యూలో ప్రశ్చించినందుకు విలేఖరిని కొట్టబోయి..నానా తిట్లు తిట్టాడు. కానీ వీరందరూ స్టార్స్‌గా మారకముందు మీడియాలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని, మీడియా సహాయాన్ని తీసుకున్న వారే. అప్పుడు నమస్కంచి, ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు మాత్రం మా న్యూస్‌, ఫొటోల వల్ల బతికే మీరు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారా? అంటూ మండిపడుతున్నారు. దీనిలో మీడియా వారిది కూడా తప్పుంది. 

కొన్నిసార్లు తప్పుగా రాయవచ్చు. దానిని పబ్లిక్‌గా ఖండించండి.. విమర్శించండి... కానీ దయచేసి.. బతుకు కోసం చేసే పనిని ఎద్దేవా చేస్తూ, ఏ పాపం ఎరుగని సదరు వ్యక్తి తల్లిదండ్రులను, భార్యలను, పిల్లలను బూతులు తిట్టకండి. భౌతిక దాడులు చేయకండి.. మీ వాదన మీరు వినిపించండి. మీరు సెలబ్రిటీలు.. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవాలని సినీ ప్రేమికులు ఆసక్తి చూపుతుంటారు. మీరు పిలవని వేడుకలకు కూడా వస్తుంటారు. ఉదయ్‌కిరణ్‌ విషయంలో మెగాఫ్యామిలీ పిలవకుండానే ఆ ఫొటోలను తీయాలని తొందరపడటం తప్పే.. అందుకే పవన్‌ చేయి చేసుకున్నాడు. కానీ మీడియా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఒకరు ఫొటోలు తీసి మీడియాలో వేస్తే, మీరెందుకు తీయలేదని యాజమాన్యాలు..సదరు మీడియా పర్సన్స్ ని ఉద్యోగాల నుంచి తీసేసి, బజారున పడేస్తాయి. అలాగే మీడియా కూడా అత్యుత్సహం ప్రదర్శించకుండా ఉంటే మంచిది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs