తాజాగా అక్కినేని నటవారసుడు అఖిల్ చేసిన ఓ ట్వీట్ అందరినీ అయోమయానికి గురిచేస్తూ, సస్పెన్స్‌లో ముంచెత్తుతోంది. దీనితో పాటు ఆయన ఓ ఫొటోను షేర్ చేస్తూ వీడెవడు? కనిపెట్టుకోండి చూద్దాం.. అంటూ ఓ ఫొటోను పెట్టాడు. కానీ ఈ ఫొటోలో హీరో ముఖం కనిపించడం లేదు. మరి వీడెవడో తెలియాలంటే వాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి14 వరకు వేచిచూడాలని అఖిల్ తెలిపాడు. దాంతో అందరిలో ఒకే క్యూరియాసిటీ నెలకొంది. కాగా ఈ పోస్ఱర్ విషయంలో అఖిల్ ఓ హింట్ ఇచ్చాడు. ఇతను నా టీమ్‌మేట్ అంటూ కొంచెం సస్పెన్స్‌ను తగ్గించాడు. దాంతో ఈ ఫొటోలో ఉన్నది హీరో నితిన్ అని అర్ధమవుతోంది. అఖిల్ చేసింది ఒక్కచిత్రం 'అఖిల్' మాత్రమే. ఆ చిత్రాన్ని హీరో నితిన్ నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అతను నితిన్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ 14 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో నితిన్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడి పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను హైదరాబాద్‌తో పాటు అమెరికాలో కూడా జరపనున్నారు. ఇందులో నితిన్ గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఇప్పటికే ఎందరినో ఆకట్టుకుంటోంది. దీంతో అఖిల్ షేర్ చేసిన ఫొటో నితిన్‌దేనని అంటున్నారు ఈ చిత్రం కోసం తాను తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయాన్ని ఆల్‌రెడీ నితిన్ తెలిపాడు.దాంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. వాస్తవానికి 'అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ' ల తర్వాత అఖిల్.. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రెండో చిత్రం చేయాలని భావించాడు. కానీ హను తదుపరి చిత్రం 14రీల్స్‌కి కమిట్ కావడం, అఖిల్ రెండో చిత్రాన్ని స్వయాన ఆయన తండ్రి నాగార్జున తమ సొంత బేనర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై చేయడానికి సిద్దమవ్వడంతో అఖిల్ రెండో చిత్రం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మొదలుకానుంది. కాగా అఖిల్ మూడో చిత్రానికి హనురాఘవపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.