Advertisement
Google Ads BL

బాలయ్య సంచలన ప్రకటన..ఫ్యాన్స్ లో జోష్‌!


తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సాధించిన ఘన విజయంతో బాలయ్య మంచి ఊపుమీదున్నాడు. ఆయన త్వరలో భవ్య ఆర్ట్స్‌ బేనర్‌లో 101వ చిత్రం, బెల్లంకొండ సురేష్‌కు ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. తాజాగా బాలయ్య ఓ సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. గతంలో బాలయ్య తండ్రి, మహానటుడు, సమైక్యాంధ్రకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఎందరో ఓ సినిమాగా తీయాలనుకున్నారు. కానీ బాలయ్య ఇతరులు ఆ కథను తీయకుండా ఎన్నో 'జాగ్రత్తలు' తీసుకున్నాడు. దాంతో అలా ఎన్టీఆర్‌ చరిత్రను తెరకెక్కించాలని భావించిన ఎందరో దానిని తీయలేక నిరాశచెందారు. ఎట్టకేలకు బాలకృష్ణ త్వరలో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ చరిత్రను సినిమాగా తీయనున్నట్లు ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ జీవితంలోని అన్ని అంశాలను స్పృసిస్తానని చెప్పాడు. మరో వంక ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రను తానే పోషించనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇక ఈ చిత్రం స్టోరీ ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉందని, దర్శకుడు, ఇతర వివరాలు చెప్పేందుకు ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించాడు. ఈ వార్తను విన్న నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య పోషించడంతో పాటు ఎప్పటి నుండో ఆయన భావిస్తున్న దర్శకత్వం కూడా ఆయనే చేపట్టనున్నాడని తెలుస్తోంది. గతంలో ఆయన తన స్వీయ దర్శకత్వంలో 'నర్తనశాల' చిత్రాన్ని ప్రారంభించి, సౌందర్య హఠాన్మరణంతో ఆ చిత్రాన్ని పక్కనపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నందమూరి మోక్షజ్ఞ బాలయ్య పాత్రను, చిన్ననాటి, యుక్తవయసులోని తండ్రి పాత్రను చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్‌ మొదలైంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs