ఒక సినిమాకు ఆడియోను ఎన్నిసార్లు విడుదల చేస్తారు? అనడిగితే ఒక్కసారే అని ఎవరైనా చెబుతారు. ఆడియో రిలీజ్ చేసి, పాటలు బావున్నాయని చెప్పి ప్లాటినమ్ ఫంక్షన్ కూడా చేసేసిన తర్వాత మళ్లీ ఆడియో రిలీజ్ చేయడం చిత్రంగా అనిపిస్తుంది. ఇది 'నువ్వేనా అది నీవేనా' అనే సినిమా విషయంలో జరుగుతోంది. ఈ చిత్రం ఆడియో మూడేళ్ళ క్రితం రిలీజ్ చేశారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు అతిథిగా ప్లాటినమ్ వేడుక 2015లో జరిపారు. మళ్ళీ ఆదివారం నాడు మరోసారి ఆడియో రిలీజ్ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేత ఆవిష్కరింపజేశారు. ఈ తతంగం చూస్తుంటే చిత్రంగా అనిపిస్తోంది.
ఒక సినిమాకు పదే పదే ఆడియో రిలీజ్ జరపడం ఏమిటనే డౌట్ మీడియాకు సైతం రాలేదు. లేదా మీడియాకు జ్ఞాపక శక్తి తక్కువని జిమ్మిక్కు చేస్తున్నారా?. తొలి కాపీ సిద్దమై రిలీజ్ కు నోచుకోని ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రచారపు ఎత్తుగడలో ఇది ఓ భాగం.