Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ల ఆలోచనా విధానం వేరేగా ఉంది..!


లోకంలో ఏ ఇద్దరి మనోభావాలు ఒకే విధంగా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ విషయంలో ఎవ్వరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో పెద్దగా గ్లామర్‌షో చేయని వారు కూడా తమ నటనతో, టాలెంట్‌తో, అందమైన ముఖకవళికలతో అగ్రస్థానంలో నిలిచిన వారు లేకపోలేదు. దీనికి చాలా మందిని ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ నేటితరం హీరోయిన్లలో గ్లామర్‌షో చేయనిదే సినిమాలలో రాణించడం కష్టమని భావించేవారు కూడా ఉంటారు. ఇటీవల స్వయంగా శృతిహాసన్‌ ఇదే విషయాన్ని వెల్లడించింది.

Advertisement
CJ Advs

ఇక ఈ మధ్యనే హీరోయిన్‌ రాఖిఖన్నా కూడా తాను 'ఊహలు గుసగుసలాడే' వంటి చిత్రాలలో అన్ని దాచుకుని నటించానని, కానీ అలా చేస్తే ఎక్కువకాలం నిలబడలేమనే విషయం తనకు తెలిసొచ్చిందని, అందుకే ఇప్పుడు ఎలా నటించడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. ముఖ్యంగా ఈ అమ్మడు 'హైపర్‌' ఆడియో వేడుకలో రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌గా కూడా పూర్తిగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ, ఆ వేడుకలో మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని 'లోఫర్‌' భామ దిశాపటానీ కూడా కుండబద్దలు కొట్టింది. గ్లామర్‌షో చేయగలిగితేనే ఆడియన్స్‌కు రీచ్‌ అవుతామని, కాబట్టి ఈ గ్లామర్‌ఫీల్డ్‌లో అందాల ఆరబోత చేయడం తప్పుకాదని, కాబట్టి ఎలాంటి ప్రదర్శనకైనా సిద్దంగా ఉండాలని కొత్తవారికి గీతోపదేశం చేసింది. ఓకే.. ఎవరి అభిప్రాయాలు వారివి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs