తన తాజా చిత్రం 'వివేగం'లో తలా అజిత్ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తున్న లుక్ ఎందరినో షాక్‌కు గురిచేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లుక్‌ని చూసిన షారుఖ్, ధనుష్, శింబు, రానా, నయనతార, వివేక్ ఒబేరాయ్‌లతో పాటు అందరూ అజిత్‌ను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇక అజిత్ తాజా సిక్స్ ప్యాక్ వెనుక స్ఫూర్తి ఎవరో తెలిసిపోయింది. 2015లో 'వేదాళమ్' రిలీజ్ తర్వాత అజిత్ తను అమ్మగా భావించే స్వర్గీయ జయలలితను ప్రత్యేకంగా కలిశాడు. తన కొడుకులాగా అజిత్‌ను చూసుకునే జయ అజిత్ లావుగా, బరువు పెరిగి ఉండటాన్ని చూసి, అలా అశ్రద్ద చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, కాబట్టి బరువు తగ్గాలని సూచించిందట. అంతలో దర్శకుడు ఈ చిత్రం కథ, ఇందులో సిక్స్‌ప్యాక్ ప్రత్యేకతను వివరించడంతో అమ్మ చెప్పినట్లు బరువుతగ్గి, ఫిట్‌గా ఉండాలనే కసితో అజిత్ ఈ వయసులో కూడా సిక్స్ ప్యాక్ సాధించాలని, ఎంతో కసితో కృషి చేసి ఈ లుక్‌ని పొందాడని సమాచారం. అలా అజిత్ సిక్స్‌ప్యాక్‌కు అమ్మ జయ స్ఫూర్తినిచ్చింది. కాగా ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.