రాజ్ తరుణ్ సినిమాల్లోకి అడుగుపెట్టిన వెంటనే హీరో అయిపోయి వరుసగా మూడు హిట్లతో లక్కీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ప్లాపులు ఒకదాని వెంట ఒకటి వచ్చినా లెక్కచెయ్యకుండా కాన్ఫిడెంట్ గా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అంటున్నాడు. ఇక ఈ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా అంతా కుక్కల చుట్టూ తిరుగుతుందని అటెంక్షన్ ని క్రియేట్ చేశారు. కుక్కలతో కూర్చున్న రాజ్ తరుణ్ ఇప్పుడు 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' అంటూ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేసాడు.
ఇక ఈ ట్రైలర్ ఆధ్యంతం కామెడీతో నిండిపోయింది. కుక్క కిడ్నప్ తో మొదలైన ఈ ట్రైలర్ 'కౌ బాయ్ కాదేహే భౌ బాయ్' అంటూ రాజ్ తరుణ్ కామెడీ పంచులతో.... ఎవడన్నా కుక్కలని కిడ్నప్ చేసి డబ్బులడుగుతారా... అంటే మరి మిమ్మల్ని కిడ్నప్ చేసి కుక్కల్ని డబ్బులడిగితే బాగోదు కదా... అనే డైలాగ్స్ తో ఈ సినిమాలో కామెడీ కి కొదవ లేదని అర్ధమై పోతుంది. ఇక రాజా రవీంద్ర పోలీస్ డ్రెస్ లో చేసే కామెడీ పంచ్ లు ఇది కుక్క కిడ్నప్ స్టోరీ కాదు ఇప్పుడిది లవ్ స్టోరీ అంటూ చెప్పే డైలాగ్స్ తో లవ్ స్టోరీ, కిడ్నప్, ఫైట్స్, కామెడీ, పంచ్ డైలాగ్స్, పాటలతో ఇది అన్నిరకాల మసాలాలు అద్దిన సినిమా గా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తో రాజ్ తరుణ్ రెడీ అయిపోతున్నాడు.
ఇక ముందుగా అనుకున్నట్టుగానే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లో హంసానందిని ఐటెం సాంగ్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని ఆ స్టెప్స్ చూస్తే అర్ధమైపోతుంది. 'నా పేరే సింగపూరు సిరిమల్లి' అంటూ హంస 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లో రచ్చ రచ్చ చేసేస్తుంది. ఇక రాజ్ తరుణ్ హీరోయిన్ అను ని గాఢమైన లిప్ లాక్ తో బందించేస్తాడు. మరి ఇన్ని మసాలాలు కలిగిఉన్న ఈ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తో మరోమారు హిట్ ట్రాక్ ఎక్కడానికి రాజ్ తరుణ్ అతి త్వరలోనే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు.