ఓ చిత్రం పెద్ద సక్సెస్ అయి, ఆ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్ల మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే మాత్రం ఇక వారి గురించి మీడియాలో మసాలా వార్తలు ఎక్కువైపోతాయి. ఈ విషయం సినీ రంగంలో చాలా సాధారణం. కాగా అనుపమపరమేశ్వర్ 'ఆ..ఆ', 'ప్రేమమ్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే దిల్‌రాజు నిర్మాణంలో శర్వానంద్,అనుపమలతో తీసిన 'శతమానం భవతి' అద్బుతమైన లాభాలను సాధించింది. దీంతో శర్వా, అనుపమల రేంజ్ మరింతగా పెరిగింది. ఈ చిత్రం సాధిస్తోన్న విజయంపై శర్వా, అనుపమలే కాకుండా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో హ్యాపీగా ఉంది. అనుపమని అయితే తమ తమ చిత్రాలతో తీసుకోవడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. శర్వానంద్ రేంజ్ కూడా బాగా పెరిగి, వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అనుపమ త్రివేండ్రంకు కూడా వెళ్లకుండా హైదరాబాద్‌లోనే తిష్ట వేసింది. దీంతో ఆమె హైదరాబాద్‌ని విడిచి వెళ్లలేకపోవడానికి శర్వానందే కారణమని, వారి మధ్య ఎఫైర్ నడుస్తోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం సినిమా ఫంక్షన్లకే కాకుండా నైట్ పార్టీలతో పాటు ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారని అంటున్నారు. కానీ వీరిద్దరి సన్నిహితులు మాత్రం వారిది కేవలం ఫ్రెండ్లీ ఎఫైరే గానీ, లవ్ ఎఫైర్ కాదని, ఓ చిత్రం హిట్టయితే అందులో నటించిన వారిపై ఇలాంటి వార్తలు రావడం సహజమేకదా..! అని వాదిస్తున్నారు.