Advertisement
Google Ads BL

శాతకర్ణిని రెచ్చగొడుతున్న ఖైదీ వసూళ్ళు!


సుమారు దశాబ్దం తర్వాత చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150  చిత్రంతో టాలీవుడ్ లో వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాడు. ఖైదీ నెంబర్.150 .. దాంతో పాటే విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణిని అధిగమించి రికార్డు కలెక్షన్స్ ను సాధిస్తుంది. తక్కువ కాలంలోనే 100 కోట్ల క్లబ్ లో ఖైదీ నెంబర్150 చేరిపోయింది. కాగా తెలుగులో ఇప్పటి వరకు వందకోట్ల క్లబ్ లో చేరిన ఏకైక సినిమాగా బాహుబలి ది బిగినింగ్ నిలిచిన విషయం తెలిసిందే. గౌతమీపుత్ర శాతకర్ణితో తీవ్రమైన పోటీని ఎదుర్కొని, అన్ని రకాలుగానూ అంటే రాయితీలు, ప్రభుత్వం ఇచ్చిన ప్రచార పర్వాలు, ప్రభుత్వం చూపిన హెచ్చు తగ్గుల ఆదరణ వంటి పలు అంశాలను అధిగమించి బాహుబలి వంటి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా వసూళ్ళ స్థాయికి చేరిపోయిన సినిమాగా ఖైది నెంబర్ 150 రికార్డ్ నమోదు చేసుకున్నది. ఖైదీ నెంబర్ 150 చిత్రం నైజాం ప్రాంతంలో వసూళ్ళు రాబట్టడంలో కాస్త వెనకబడినా, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో సంచలనాత్మకంగా వసూళ్ల సునామీని సృష్టిస్తుంది. అందుకనే ఖైదీ నెంబర్ 150 చిత్రానికి వస్తున్న వసూళ్ళ పర్వాన్ని, ఆదరణను, చిత్రబృందం ఎప్పటికప్పుడు కలెక్షన్ వివరాలను వెల్లడిస్తుంది. ఈ దిశగా చూసినప్పుడు ఇదే స్థాయిలో తెరకెక్కించి అంతే సమాన స్థాయి హీరోగా చెలామణి అవుతున్న బాలకృష్ణ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్ వివరాలను ఎక్కడా ప్రస్తావించక పోవడంతో బాలకృష్ణ కాస్త అసహనానికి లోనైనట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు క్రిష్ వద్ద బాలకృష్ణ పలు మార్లు వ్యక్త పరిచినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

కాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని రికార్డు స్థాయిలో అంటే కేవలం 79 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు క్రిష్. అందుకు అందరివద్ద నుండి ప్రశంసలను అందుకున్నాడు క్రిష్.  కానీ ఇంత చేసినా చిరంజీవి సినిమా కలెక్షన్లు బయటపెడుతుండటం... శాతకర్ణి సినిమాకు సంబంధించి అసలు ఆ కలెక్షన్ల ఊసే ఎత్తక పోవడంతో  బాలకృష్ణ కాస్త అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంక వెంటనే శాతకర్ణి కలెక్షన్స్ వివరాలను కూడా బయటపెట్టాలని బాలకృష్ణ శాతకర్ణి టీంకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంతలా చెప్పినా శాతకర్ణి వసూళ్ళు  బయటపెట్టకపోవడంతో బాలయ్య ఉన్నపళంగా దర్శకుడు క్రిష్ పై రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.  

కాగా  ఖైదీ నెంబర్ 150 చిత్రం హీరో చిరంజీవి స్వయంగా ఊపిరితిత్తులకు సంబందించిన వ్యాధితో భాదపడుతున్న దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరిని కిమ్స్ లో పరామర్శించిన సందర్భంగా దాసరి ఆయనతో మాట్లాడిన మాటల్లో ప్రముఖంగా ఖైదీ వసూళ్ళ గురించే మాట్లాడారట. మొత్తానికి క్షణ క్షణం ఖైదీ వసూళ్ళే శాతకర్ణి చెవుల్లో గింగిరులు తిరిగేలా చిరంజీవి కూడా ఖైదీ వసూళ్ళ గురించి ప్రస్తావించడంతో ఇక బాలకృష్ణ మరింత అసహనానికి లోనవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించిన చిరు.. దాసరి కోలుకుంటున్నారని, చాలా హుషారుగా ఖైదీ కలెక్షన్స్ గురించి వాకబు చేశారని అన్నాడు. అంటే దాసరి వెంటిలేటర్ పై ఉండడంతో ప్రత్యేకంగా పెన్నుతో పేపర్ పై  ఖైదీ నెం 150 వసూళ్ల గురించి ప్రస్తావిస్తూ ఖైదీ నెం 150 స్కోర్ ఎంత ?అని అడిగారని చిరంజీవి తెలిపాడు.  ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. ఖైదీ చిత్రం థాంక్స్ గివింగ్ సభకు దాసరి ఖచ్చితంగా హాజరవుతారన్న నమ్మకాన్ని చిరు వ్యక్తం చేశారు. మొత్తానికి చిరంజీవి మాటలు బాలకృష్ణను మరీ రెచ్చగొట్టేలా ఉన్నాయన్న మాట.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs