ఒక పక్కన త్రివిక్రమ్...పవన్ కళ్యాణ్ - చిరంజీవితో మల్టీస్టారర్ మూవీ కి సైన్ చేసాడని మీడియాకి ప్రకటన ఇచ్చేసాడు సుబ్బరామిరెడ్డి. అంటే త్రివిక్రమ్, పవన్ కి ఒక సినిమా చెయ్యాల్సి వుంది. ఆ సినిమా అయ్యాక ఆ మల్టీస్టారర్ ని మొదలు పెడతాడా? లేక? అనేది ఇంకా క్లియర్ కాలేదు. మరో పక్క ఎన్టీఆర్, త్రివిక్రంతో ఒక సినిమాని ఎలాగైనా చెయ్యాలని కాచుకూర్చుని తనతో సినిమా చెయ్యడానికి త్రివిక్రమ్ ని ఒప్పించి మరీ అధికారిక ప్రకటన వచ్చేలా చేసాడు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ అలా మెగా మల్టీస్టారర్ ని ఒప్పుకోవడంతో ఎన్టీఆర్ ఊహలకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తుంది.
అసలు ఆ మెగా మల్టీస్టారర్ సినిమా ప్రకటన వెలువడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. మరి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది చివరిలో మొదలవుతుందని.. ఇక సినిమా మొదలయ్యాక వారి కాంబినేషన్లో అంచనాలు అందుకోవడం ఎవ్వరి వల్ల కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ కలలు కంటున్నారు. మరి ఇప్పుడు ఉహించని విధంగా మెగా మల్టీస్టారర్ ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని ప్రకటన రాగానే ఆ సినిమాపై ఎంతగా అంచనాలుంటాయో ఊహించడం కూడా కష్టమే. అసలు పవన్ తో త్రివిక్రమ్ మొదలెట్టాల్సిన చిత్రం ఒకటి ఉండగానే మళ్ళీ ఇలా మెగా మల్టీస్టారర్ అంటూ త్రివిక్రమ్ లాక్ చేయడం చూస్తుంటే ఎన్టీఆర్ ని ఆ మెగా మల్టీస్టారర్ చిత్రం కోసం పక్కన పెడతారనే వాదన వినబడుతుంది.
అదే గనక జరిగితే పాపం ఎన్టీఆర్ అతిగా ఆశపడి ఇప్పుడు పూర్తి నిరాశలో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ - ఎన్టీఆర్ చిత్రం మెగా మల్టీస్టారర్ సినిమాకి ముందా? వెనుకా? అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ఉంటుంది కానీ.... అది ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమే.