Advertisement
Google Ads BL

హుందాగా మాట్లాడుతున్న నాగ్‌...!


వాస్తవానికి రాఘవేంద్రరావు-నాగార్జునల కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలైన 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలు మంచి ఆదరణపొందాయి, నటునిగా నాగ్‌కు ప్రశంసలు లభించాయి. కానీ వారి కాంబినేషన్‌లో వచ్చిన 'శిరిడీ సాయి' మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అందులో నాగ్‌ ఒకప్పుడు శిరీడీ సాయిగా నటించిన విజయ్‌చందర్‌ని మెప్పించలేకపోయాడనేది వాస్తవం. కానీ చాలా మంది ఆయన అభిమానులు గానీ, సోకాల్డ్‌ మీడియా గానీ ఆ చిత్రం బాగా ఆడలేదని, నాగ్‌ ఆ పాత్రలో మెప్పించలేకపోయాడనే వాస్తవాలను అంగీకరించకుండా అనవసర భజన చేస్తుంటారు. కానీ తాజాగా నాగ్‌ రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తున్న 'ఓం నమోవేంకటేశాయ' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో పెద్దగా శిరిడీ సాయి గురించి హైలైట్‌గా మాట్లాడకుండా తన హుందాతనాన్ని మరోసారి నిరూపించుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక చిరంజీవి 150వ చిత్రం విషయంలో, బాలయ్య 100వ చిత్రం విషయంలో మాత్రం చాలామందిలో బిన్నాభిప్రాయాలున్నాయి. వారు చేసిన అతిథి పాత్రల వంటివి వారు పరిగణనలోకి తీసుకున్నారో.. లేదో.. లెక్కలోకి తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో... తీసుకుంటే ఎందుకు తీసుకున్నారో... వంటి విషయాలపై ఇప్పటికి కూడా సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈ విషయంలో కూడా నాగ్‌ చాలా ఓపెన్‌గా మాట్లాడాడు.తన వందవ చిత్రంగా 'బంగార్రాజు' చేయనున్నాడనే వార్తలపై ఆయన స్పందించాడు. ప్రస్తుతం 'రాజుగారి గది2' చిత్రం చేస్తున్నానని, ఆ తర్వాత 'బంగార్రాజు' ఉంటుందని తెలిపాడు. అయితే తన అభిమానులు తాను నటించిన అతిథి పాత్రలను కూడా పరిగణనలోకి తీసుకుని, తన వందో చిత్రాన్ని లెక్కేస్తున్నారని, దీనిపై త్వరలో తాను అఫీషియల్‌గా ప్రకటన చేస్తానని, తన వందో చిత్రం ఏమిటో? ఆ లెక్కలేమిటో అందరికీ వివరిస్తానని సమాధానం ఇవ్వడం హర్షణీయం. 

ఇక భక్తిరస చిత్రాలలో నాగ్‌-రాఘ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'ఓం నమో వేంకటాశాయ' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం భక్తిరస చిత్రాలను ఆదరించే ప్రేక్షకులను మాత్రమే కాకుండా మాస్‌, యూత్‌ను కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈనెల 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగా జరిగిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో 24కోట్లు, ఓవర్‌సీస్‌లో 5.5కోట్లు, రెస్టాఫ్‌ ఇండియాలో 3కోట్లు, శాటిలైట్‌ హక్కుల ద్వారా 12 కోట్ల వరకు వచ్చాయని సమాచారం. ఇక ఈ చిత్రమైనా 'శిరిడీ సాయి'ని నిర్మించిన మహేష్‌రెడ్డికి భారీ లాభాలను తెచ్చిపెట్టి, శిరిడీ సాయితో వచ్చిన నష్టాలను భర్తీ చేస్తుందో లేదో చూడాలి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs