గాలిలో విహరించే పక్షిరాజు డేగకు విమానంలో ప్రయాణికుల సీట్లో కూర్చుని దర్జాగా ప్రయాణించే యోగం పట్టింది. సీట్లలో వాటికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీట్లలో, బెల్ట్ ధరించి మరీ ప్యాసింజెర్స్ తో పాటుగా జర్నీ చేశాయి. సౌదీలో కొందరు బడాబాబులు డేగలను తరచుగా విమానంలో తీసుకెళుతుంటారు. దేశాలను దాటిస్తారు. అయితే ఒకేసారి 80 డేగల కోసం సౌదీ రాకుమారుడు టికెట్లు కొని మరీ తీసుకెళ్ళడం విశేషం. సౌదీలో వేటకోసం డేగలను ఉపయోగిస్తారు. వాటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారనే విషయం తెలిసిందే. డేగ యుఏఈ జాతీయ పక్షి. వేటాడడంలో దాన్ని మించిన పక్షి మరొకటి లేదు. మరో చిత్రమైన విషయం ఏమంటే డేగలకు అక్కడ పాస్ పోర్ట్ తప్పని సరిగా తీసుకోవాలి. కొన్ని విమానయాన సంస్థలు వీటి తరలింపునకు అనుమతి ఇస్తాయి.