నాగబాబు ఇది తెలుసుకుంటే బెటర్..!


నటునిగా, నిర్మాతగా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయిన మెగాబ్రదర్‌ నాగబాబు ప్రస్తుతం ఈటీవీలో బాగా పాపులర్‌ అయిన 'జబర్దస్త్‌' ప్రోగ్రాంకు రోజాతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మల్లెమాల సంస్థ కేవలం ఓ పది, పదిహేను ఎపిసోడ్లతో ముగించాలని భావించినా కూడా ఈ ప్రోగ్రాంకు వస్తున్న రెస్పాన్స్‌ను, టీఆర్పీ రేటింగ్స్‌ను గమనించి, రామోజీ సలహా, సహకారాలతో నాలుగేళ్లుగా నడుపుతోంది. ఇక ఈ కార్యక్రమానికి అనసూయ,రేష్మి వంటి వారి గ్లామర్‌, హాట్‌ షో కూడా ఓ కారణమేనని ఒప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో వచ్చే స్కిట్స్‌లో బూతుపదాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, అసభ్యపదజాలం వంటివి ఎక్కువయ్యాయనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. వర్మ కూడా నాగబాబును కౌంటర్‌ చేయడంలో ఈ అంశాన్ని కూడా ఓ అస్త్రంగా వాడుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రాంలోని అసభ్యతపై నాగబాబు స్పందించాడు. 

కామెడీలో ఎన్నోరకాలు ఉన్నాయని, అందులో స్పైసీ, డబుల్‌మీనింగ్‌, అడల్ట్‌ కామెడీ కూడా ఓ భాగమేనని తనను తాను సమర్ధించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో అప్పుడప్పుడు అలాంటివి దొర్లడం సహజమే.... ఇందులో ఎన్నో మంచి స్కిట్స్‌ కూడా వస్తున్నాయి. హద్దులు దాటితే నేను హెచ్చరిస్తూనే ఉంటాను. ఈ కార్యక్రమాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలని సూచించాడు. మొత్తానికి ఈ విషయంలో నాగబాబు తనను తాను సమర్ధించుకునే ప్రయ్నతాలు చేస్తున్నాడు. కానీ బుల్లితెర అంటే ఫ్యామిలీ అంతా కలసి, తమ కొడుకులు, కూతుర్లతో అందరూ కలిసి చూసే సాధనం అనేది గమనించాలి. సినిమాలకు, బుల్లితెరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తెరగాలి. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం ఏళ్లకు ఏళ్లుగా నడుపుతున్న 'పాడుతా తీయగా' కార్యక్రమంలో పాల్గొనే అందరినీ అచ్చమైన తెలుగు సంప్రదాయమైన లంగాలు, ఓణీలు, చీరలు వంటి దుస్తులతో రావాలని సూచించి, దానిని పాటిస్తున్నాడు. మరి నాగబాబు, రోజాలు.. అనసూయ, రేష్మి వంటి వారి దుస్తులను, చేష్టలను ఎందుకు నివారించలేకపోతున్నారు? గతంలో తన వృత్తిలో భాగంగా బాలు కూడా పలు బూతుపాటలు పాడినది కూడా వాస్తవమే. కానీ ఆ తర్వాత ఆయన అలా పాడినందుకు తన పశ్చాత్తాపాన్ని కూడా వెల్లడించారు. కాబట్టి నాగబాబు భవిష్యత్తులో అలాంటి పశ్చాతాపాలు పడకుండా ఉండాలంటే ఇప్పటికైన తన తప్పును తెలుసుకోవాలి....! 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES